ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీలలో బిగ్ బాస్ వాహా నడుస్తోందని చెప్పవచ్చు. బిగ్ బాస్ అన్ని ఇండస్ట్రీల లోనూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అంతే కాకుండా ఒకసారి ఈ షో లోకి ఎంట్రీ అయిన తరువాత ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు లభిస్తోంది. ఇంకా చెప్పాలి అంటే చాలా మందికి మంచి మంచి ఆఫర్లు కూడా వచ్చాయి.తెలుగు,తమిళం, హిందీతో పాటు పలు బాషలలో బిగ్ బాస్ మానియా నడుస్తుంది.
తెలుగులో బిగ్‌బాస్ ఐదో సీజన్ కి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.అటు తమిళంలోనూ స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్‌గా ఐదో సీజన్ రన్ అవుతోంది. హిందీలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు.అయితే ఇటీవలే తమిళంలో బిగ్ బాస్ షో మొదలు కాగా, ఈ షోలో 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో అక్షర రెడ్డి ఒకరు. ఈమె ఒక మోడల్, మిస్ గ్లోబ్ 2019 అవార్డు గ్రహీత కూడా.
గతంలో విల్లా టు విలేజ్ అనే రియాలిటీ షోలో కూడా పాల్గొంది.అలాగే కసు మెలా కసు అనే మలేషియన్ మూవీలోనూ తొలిసారి గా నటించింది.బిగ్ బాస్ లో ఉన్న అక్షరకు టాలీవుడ్ హీరో రానా భార్య మిహికా సపోర్ట్ చేయాలని కోరింది. బిగ్‌బాస్ తమిళ ఐదో సీజన్‌లో పాల్గొన్న నా ప్రియ మిత్రురాలు అక్షరకు అభినందనలు.
బిగ్ బాస్ లో పాల్గొన్న నా ఓటు అక్షరకే, మీరు కూడా ఆమెకే ఓటేస్తున్నారని భావిస్తున్నాను.ఎలా అయినా సరే బిగ్‌బాస్ ట్రోఫీ సంపాదించుకుని వస్తావని ఆశిస్తున్నాను, ఆల్ ద బెస్ట్ అక్షర అంటూ వీడియో షేర్ చేసింది మిహికా.ఇక రానా మిహిక కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న విషయం మన అందరికి తెలిసిందే.ప్రస్తుతం రానా భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…