యూట్యూబ్ ఛానల్ లకు హెచ్చరికలు జారీ చేసిన మా నూతన అధ్యక్షుడు.. అలాంటి వారిపై చర్యలు తప్పవు!

0
620

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మహిళల భద్రతను వారి సాధికారతను పెంచడం కోసం ఒక కమిటీని వేసిన సంగతి మనకు తెలిసిందే. నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలోనే మహిళల కోసం విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌(WEGC)ను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ క్రమంలోనే విష్ణు మాట్లాడుతూ మహిళల పట్ల ఎంతో దారుణమైన వీడియోలు, థంబ్‌నైల్స్‌ పెడుతూ వారిని అవమాన పరుస్తున్నారని,ఇలా మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించే యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోబోతున్నట్లు విష్ణు వెల్లడించారు.

ఎంతో మంది మహిళ ఆర్టిస్టులను హీరోయిన్లను గౌరవించడం మన సాంప్రదాయం అంతేగాని వారి గురించి అసభ్యకరమైన వీడియోలు పెడితే మాత్రం వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆ విషయంలో ఉపేక్షించేది లేదని విష్ణు యూట్యూబ్ ఛానల్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు విష్ణు వెల్లడించారు.

ఈ క్రమంలోనే విష్ణు మాట్లాడుతూ తెలుగు మీడియా ఎప్పుడు హద్దులు దాటలేదు తన కుటుంబం పట్ల,చిత్ర పరిశ్రమ పట్ల మీడియా ఎప్పుడు సానుకూలంగా ఉందని ఈ సందర్భంగా విష్ణు తెలుపుతూ యూట్యూబ్ ఛానల్ హెచ్చరికలు జారీ చేశారు.