మల్టీస్టారర్ అనే పదం కొత్తదేమీ కాదు దాదాపు ఇది ఆనాటి లెజెండరీ హీరోలైనా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు కాలంలోనే మల్టీస్టారర్ చిత్రాలు రూపుదాల్చాయి. పల్లెటూరిపిల్ల, మిస్సమ్మ, గుండమ్మకథ, రామకృష్ణులు, తెనాలి రామకృష్ణుడు, సత్యం శివం లాంటి దాదాపు 15 చిత్రాల్లో ఎన్టీ రామారావు నాగేశ్వరావు కలిసి నటించారు. ఆ తరువాత వచ్చిన జనరేషన్ లో శోభన్ బాబు, కృష్ణ కాంబినేషన్ లో కొన్ని మల్టీస్టారర్ చిత్రాలు రూపొందించబడ్డాయి. సూపర్ స్టార్ కృష్ణ తన కంటే సీనియర్ హీరోలతో తన సమకాలీనులతో తనకంటే జూనియర్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు.
ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, కాంతారావు, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలతో కృష్ణ నటించడం జరిగింది. అయితే శోభన్ బాబు, కృష్ణ కాంబినేషన్ శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో ప్రారంభమయ్యింది. ఆ తర్వాత లక్ష్మీ నివాసము, మంచి మిత్రులు, గంగామంగ, మామంచి అక్కయ్య, పుట్టినిల్లుమెట్టినిల్లు, విచిత్ర కుటుంబం, మండే గుండెలు, కృష్ణ అర్జునులు, ముందడుగు, ఇద్దరు దొంగలు, మహాసంగ్రామం లాంటి చిత్రాల్లో వీరు కలిసి నటించారు. అయితే శోభన్ బాబు క్లాస్ పాత్రలు ధరిస్తే.. కృష్ణ మాస్ పాత్రలు ధరించేవారు. వయసురీత్యా శోభన్ బాబు కృష్ణ కంటే పెద్దవారు కావున అదే తరహాలో కృష్ణ ఆయనను గౌరవించేవారు.
1983 సురేష్ ప్రొడక్షన్స్ లో బాపయ్య దర్శకత్వంలో ‘ముందడుగు’ చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో లో శోభన్ బాబు, కృష్ణ, జయప్రద శ్రీదేవి కలిసి నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని చిత్రాల్లో కంటే ముందడుగు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఏకంగా ఈ చిత్రం గోల్డెన్ జూబ్లీని జరుపుకుంది. ఈ చిత్రం ఇద్దరు హీరోల లో తీవ్రమైన జోష్ నింపింది. తర్వాత 1985లో సంయుక్త మూవీస్, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మహాసంగ్రామం చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అందాల నటుడు శోభన్ బాబు, జయసుధ, జయప్రద హీరో హీరోయిన్లుగా నటించారు.
కోదండరామిరెడ్డి చెప్పిన కథ విన్నప్పుడు శోభన్ బాబు కృష్ణతో పోలిస్తే తన పాత్ర తేలి పోయినట్టుగా ఉందని పేర్కొన్నారు. సినిమా షూటింగ్ సమయంలో సరి చేస్తామని చెప్పడంతో శోభన్ బాబు మహాసంగ్రామం చిత్రంలో కృష్ణతో కలిసి నటించారు. తీరా సినిమా విడుదలైన అనంతరం కృష్ణతో పోలిస్తే శోభన్ బాబు పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం లాంటి కారణాలతో శోభన్ బాబు అభిమానులు థియేటర్స్ ముందు గొడవకు దిగారు. శోభన్ బాబు దర్శకుడు కోదండరామిరెడ్డిని వివరణ కోరగా ఆయన సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఇక ఈ సినిమా తర్వాత శోభన్ బాబు, కృష్ణ కాంబినేషన్ లో మరో చిత్రం రాలేదు. చక్రవర్తి అందించిన సంగీతం లో ‘ఎక్కడో చూసిన జ్ఞాపకం… ఎన్నడో కలిసిన జ్ఞాపకం’ అనే పాట ఆ రోజుల్లో బాగా విజయవంతమైనప్పటికీ మహాసంగ్రామం చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం మూట కట్టుకుంది.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…