Featured

Akhanda Movie Producer: ‘అఖండ’ నిర్మాత గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Akhanda Movie: ‘అఖండ’ మూవీ భారీ హిట్ కొట్టింది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. నందమూరి నటసింహం బాలక్రిష్ణ నటన విశ్వరూపానికి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. బోయపాటి, బాలక్రిష్ణ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ హిట్ కొట్టడంతో అఖండ సినిమాపై  ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో థియేటర్లకు ఆడియన్స్ తరలివెళ్లి పెద్ద హిట్ చేశారు. దీనికి తోడు థమన్ మ్యూజిక్ కూడా అఖండ సినిమాకు ప్లస్ అయింది. 

అయితే తాజాగా ఈసినిమా నిర్మాతపై అందరి చూపు పడింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమాకు. ద్వారకా క్రియేషన్ నిర్మాణ సారథ్యంలో అఖండ హిట్ సాధించింది. భారీ వసూళ్లను రాబట్టింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన మిర్యాల రవీందర్ రెడ్డి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ల జాబితాలో చేరాడు. సూర్యాపేట జిల్లాలో పుట్టిన మిర్యాల రవీందర్ రెడ్డి ఐరన్, కన్స్ట్రక్షన్ బిజినెస్ లో రాణించాడు.

అయితే సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో తొలిసినిమా గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చి ’సాహసం శ్వాసగా సాగిపో‘ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆతరువాత ’ జయ జానకీ నాయక‘ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. మూడో సినిమాగా.. బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రాన్ని నిర్మించి సూపర్ హిట్ కొట్టాడు. 2018లో బోయపాటి ఈ కథను పలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలకు వినిపించారు. అయితే మిర్యాల రవీందర్ రెడ్డి ముందుకు రావడంతో ద్వారకా క్రియేషన్ పై అఖండను నిర్మించారు. 

కలెక్షన్లపై కూడా ఓ అంచనా ఉందట..

అయితే భారీ బడ్జెట్ పెడుతున్నానని రవీందర్ రెడ్డి ఏం భయపడలేదట.. అఖండ యూనివర్సల్ సబ్జెక్ట్ అని తప్పని సరిగా విజయం సాధిస్తుందని.. కలెక్షన్లు ఎంత వస్తాయనేదానిపై కూడా అంచనా ఉందట. సినిమాను ప్రస్తుతం హిందీలో తీయాలని అనుకుంటున్నారట రవీందర్ రెడ్డి. అఖండను హిందీలో తీస్తే అజయ్ దేవ్ గన్ హీరోగా సరిపోతారని అనుకుంటున్నారు. త్వరలో అల్లు అర్జున్- బోయపాటి ల కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి కూడా ఈయన ఓ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

8 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

11 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

11 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

11 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

13 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

14 hours ago