Featured

Items Songs in 2021 : ఈ ఏడాది దుమ్మురేపిన ఐటెం సాంగ్స్ ఏంటో తెలుసా?

బొమ్మ బ్లాక్ బస్టర్ కావాలంటే.. సినిమాలో ఐటెం సాంగ్ ఉండాల్సిందే. అందుకే దర్శకుడు స్పెషల్ సాంగ్ కోసం స్పెషల్ ఏర్పాట్లు చేస్తారు. అందులో భాగంగానే ప్రస్తుతం టాప్ హీరోయిన్లను పట్టుకొచ్చి ఐటెం సాంగ్స్ చేయిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ పాటలో సినిమాకు పిచ్చ క్రేజ్ తీసుకొస్తున్నారు. సినిమాను హిట్ చేయడంలో ఈ పాటలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఇయర్ లో కూడా పలు స్పెషల్ సాంగ్స్ సంచలనాలు కలిగించాయి. ఈ పాటల కోసం కొందరు హీరోయిన్లు ఐటెం గర్ల్స్ గా మారిపోయారు కూడా. 2021లో సత్తా చాటి ఐటెం సాంగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Items Songs in 2021 : ఈ ఏడాది దుమ్మురేపిన ఐటెం సాంగ్స్ ఏంటో తెలుసా?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో మూడు సినిమాలు నిలిచాయి. అందులో క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లోనూ ఐటెం సాంగ్స్ అదరగొట్టాయి.

క్రాక్ సినిమాలో భూమ్ బద్దల్

Items Songs in 2021 : ఈ ఏడాది దుమ్మురేపిన ఐటెం సాంగ్స్ ఏంటో తెలుసా?

క్రాక్ సినిమాలో భూమ్ బద్దల్ అంటూ అప్సరా రాణి దుమ్మురేపింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవి తేజ హీరో గా నటించగా శ్రుతీ హాసన్ హీరోయిన్ గా నటించింది.

రెడ్ మూవీ లోని డించిక్ డించిక్ డింకా

Items Songs in 2021 : ఈ ఏడాది దుమ్మురేపిన ఐటెం సాంగ్స్ ఏంటో తెలుసా?

అటు రెడ్ సినిమా కోసం ఐటెం గర్ల్ గా మారింది హెబ్బా పటేల్. డించిక్ డించిక్ అంటూ ఊపు ఊపింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో రామ్ హీరో గా నటించగా, నివేద పేతురేజ్ మెయిన్ లీడ్ గా నటించింది.

అల్లుడు అదుర్స్ లోని రంభ ఊర్వశి మేనక

Items Songs in 2021 : ఈ ఏడాది దుమ్మురేపిన ఐటెం సాంగ్స్ ఏంటో తెలుసా?

ఇక అల్లుడు అదుర్స్ సినిమాలో చిట్టి పొట్టి బట్టలతో అందాలను బయటపెట్టి కుర్రోళ్ల మతి పోగొట్టింది మోనాల్ గజ్జర్. రంభ ఊర్వశి మేనక అంటూ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు నభ నటేష్ మెయిన్ లీడ్ లో నటించారు.

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలోని మందులోడా ఓరి మాయలోడా

Items Songs in 2021 : ఈ ఏడాది దుమ్మురేపిన ఐటెం సాంగ్స్ ఏంటో తెలుసా?

అటు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలోని ఐటెం సాంగ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది. ఈ పాటలో స్నేహా గుప్తా మందులోడా ఓరి మాయలోడా పాత కోసం.. తన అందాల కనువిందు చేస్తూ సూపర్ స్టెప్పులతో అదరగొట్టింది. ఇక ఈ చిత్రంలో అజయ్, ఆనందిని మెయిన్ లీడ్ లో నటించారు.

Items Songs in 2021 : ఈ ఏడాది దుమ్మురేపిన ఐటెం సాంగ్స్ ఏంటో తెలుసా?

సీటీమార్ సినిమాలో పెప్సీ ఆంటీ పాట కోసం తన ఒంపు సొంపులతో మరోసారి అదరగొట్టింది అప్సర రాణి. గోపీచంద్ హీరో గా, తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఈ ఐటెం సాంగ్ హైలెట్ గా నిలిచింది.

Items Songs in 2021 : ఈ ఏడాది దుమ్మురేపిన ఐటెం సాంగ్స్ ఏంటో తెలుసా?

ఇక కెరీర్ లో తొలిసారి ఐటెం సాంగ్ చేసింది సమంతా. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఊ అంటావా మామా అంటూ ఊపు ఊపేసింది. స్పెషల్ సాంగ్ లో ఊర మాస్ స్టెప్పులు వేసి జనాలను ఫిదా చేసింది. మొత్తంగా ఈ ఏడాది పలు ఐటెం సాంగ్స్ అదుర్స్ అనిపించాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago