Akhanda Movie: ‘అఖండ’ మూవీ భారీ హిట్ కొట్టింది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. నందమూరి నటసింహం బాలక్రిష్ణ నటన విశ్వరూపానికి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. బోయపాటి, బాలక్రిష్ణ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ హిట్ కొట్టడంతో అఖండ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో థియేటర్లకు ఆడియన్స్ తరలివెళ్లి పెద్ద హిట్ చేశారు. దీనికి తోడు థమన్ మ్యూజిక్ కూడా అఖండ సినిమాకు ప్లస్ అయింది.
అయితే తాజాగా ఈసినిమా నిర్మాతపై అందరి చూపు పడింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమాకు. ద్వారకా క్రియేషన్ నిర్మాణ సారథ్యంలో అఖండ హిట్ సాధించింది. భారీ వసూళ్లను రాబట్టింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన మిర్యాల రవీందర్ రెడ్డి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ల జాబితాలో చేరాడు. సూర్యాపేట జిల్లాలో పుట్టిన మిర్యాల రవీందర్ రెడ్డి ఐరన్, కన్స్ట్రక్షన్ బిజినెస్ లో రాణించాడు.
అయితే సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో తొలిసినిమా గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చి ’సాహసం శ్వాసగా సాగిపో‘ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆతరువాత ’ జయ జానకీ నాయక‘ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. మూడో సినిమాగా.. బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రాన్ని నిర్మించి సూపర్ హిట్ కొట్టాడు. 2018లో బోయపాటి ఈ కథను పలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలకు వినిపించారు. అయితే మిర్యాల రవీందర్ రెడ్డి ముందుకు రావడంతో ద్వారకా క్రియేషన్ పై అఖండను నిర్మించారు.
అయితే భారీ బడ్జెట్ పెడుతున్నానని రవీందర్ రెడ్డి ఏం భయపడలేదట.. అఖండ యూనివర్సల్ సబ్జెక్ట్ అని తప్పని సరిగా విజయం సాధిస్తుందని.. కలెక్షన్లు ఎంత వస్తాయనేదానిపై కూడా అంచనా ఉందట. సినిమాను ప్రస్తుతం హిందీలో తీయాలని అనుకుంటున్నారట రవీందర్ రెడ్డి. అఖండను హిందీలో తీస్తే అజయ్ దేవ్ గన్ హీరోగా సరిపోతారని అనుకుంటున్నారు. త్వరలో అల్లు అర్జున్- బోయపాటి ల కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి కూడా ఈయన ఓ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…