Balakrishna- Nivetha Thomas: జై బాలయ్య సాంగ్ మానియా ఊపేస్తుందిగా..నివేదా థామస్ స్టెప్పులు.. వైరల్ కానీ…!
Balakrishna- Nivetha Thomas: కరోనా తరువాత ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించిన సినిమాల్లో బాలకృష్ణ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. బాలకృష్ణ నట విశ్వరూపంతో అఖండ… బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. బాలయ్య కెరీర్లోనే వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీపై ముందు నుంచే అంచానాలు ఉన్నాయి.
ఇంతకు ముందు వీరద్దరూ చేసిన సింహ, లెజెండ్ మూవీలు సూపర్ హిట్ అయ్యాయి. వీటిని మరిపించే విధంగా అఖండ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. వీరద్దరి కాంబినేషన్ లో హ్యట్రిక్ హిట్ పడింది. ఇదిలా ఉంటే అఖండలో తన నట విశ్వరూపాన్ని చూపించిన బాలకృష్ణ రెండు క్యారెక్టర్లను పోషించారు. దీంతో క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లతో బ్రహ్మరథం పట్టారు.
దీనికి తోడు థమన్ మ్యూజిక్ పెద్ద హిట్ అయింది. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తన సత్తా చాటాడు. సినిమా విడుదలకు ముందే ’జై బాలయ్య‘ పాట రికార్డులను క్రియేట్ చేసింది. బాలయ్య స్టెప్పులు జనాలకు పిచ్చపిచ్చగా నచ్చాయి.
జై బాలయ్య సాంగ్ పై రీల్స్, వీడియోలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేస్తుకుంటున్నారు కొంత మంది. అంతగా హిట్ అయింది ఈసాంగ్. తాజా మళయాళ భామ నివేదా థామస్ కూడా జైబాలయ్య సాంగ్ కు స్టెప్పులేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేదా.. డ్యాస్సులతో తన అభిమానులను అలరిస్తుంది. తాజాగా జై బాలయ్య సాంగ్ లో బాలకృష్ణ షర్టులు మారే స్టెప్పును నివేదా ట్రై చేసింది. అయితే మొదటి షర్ట్ వచ్చినా… రెండో షర్ట్ రాలేదు.. దీంతో సరదాగా చేసిన ఈవీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ఏదేమైనా అఖండ ఎక్స్‌పీరియెన్స్ అదిరిపోయింది’ అని క్యాప్షన్ ఇచ్చింది నివేదా థామస్.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…