Bheemla Nayak: పవన్ పక్కన కానిస్టేబుల్ గా కనిపించిన అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసా?
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినభీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఈ రేంజ్ లో రికార్డు బద్దలు కావడం సర్వసాధారణం. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర తర్వాత చెప్పుకోవాల్సింది ఎవరికైనా ఉందా అంటే పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ పాత్ర అని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ పాత్రలో నటించిన
కానిస్టేబుల్ హరిణిగా కనిపించిన అమ్మాయి మరెవరో కాదు ప్రముఖ యూట్యూబర్ మౌనిక రెడ్డి. ‘అమ్మాయి
క్యూటు అబ్బాయి నాటు’ వెబ్ సిరీస్ తో యువతకి బాగా దగ్గరైంది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ సరసన సూర్య సిరీస్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేశారు.పవన్‌తో పాటు రానాకి మద్యం సప్లై చేసిన నేరానికి గాను ఆమె ఉద్యోగం కోల్పోవలసి పరిస్థితి వస్తుంది. దీంతో తన ఉద్యోగం కోల్పోకుండా తనకోసమే పవన్ కళ్యాణ్ తన ఉద్యోగం వదులు కోవడానికి కూడా సిద్ధపడతాడు.
ఆ సమయంలో వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మౌనిక రెడ్డి ఎంటరైనప్పుడే విజిల్స్ పడ్డాయి అంటే ఈమె స్క్రీన్ అప్పీరెన్స్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో చెప్పవచ్చు. మౌని రెడ్డి పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా యూట్యూబర్ గా మాత్రమే కాకుండా, ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…