విజయ నిర్మల… టాలీవుడ్ ఇండస్ట్రీ లో బాలనటిగా తన సినీ కెరీర్ ప్రారంభించి, సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయన్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా.. తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ ఈవిడ. ఇందుకు గాను విజయ నిర్మల కు గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించినా ఘనత ఆమెకే చెల్లింది. ‘మీనా’ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న విజయ నిర్మల ఆ తర్వాత దాదాపు 40కి సినిమాలకు డైరెక్ట్ చేసింది.
ఇక ఈమె పర్సనల్ విషయానికి వస్తే… ఫిబ్రవరి 20, 1946 న నరసరావుపేట లో జన్మించారు. విజయనిర్మల తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు.విజయ నిర్మల తండ్రి సినిమాలు నిర్మించే వారు. నటి జయసుధ విజయ నిర్మల బంధువులు. విజయ నిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. ఈమె అసలు పేరు నిర్మల అయితే, ఈవిడ సినీ ఇండస్ట్రీ లోకి వచ్చేసరికి అక్కడ మరో నిర్మల (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడంతో తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా తన పేరును విజయ నిర్మల అని పేరు మార్చుకొన్నది. కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 27, 2019 లో కోలుకోలేక మరణించింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో తన నటనతో మెప్పించిన విజయనిర్మల, 1965 సంవత్సరం లో తమిళ్ సినిమా ‘ ఎంగా వీట్టు పిళ్ళై ‘ సినిమా ద్వారా ఆవిడ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి విజయ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇక 1965 సంవత్సరం లోని ‘ మంచి కుటుంబం’ అనే సినిమా లో కూడా నటించారు. ఇక అప్పటినుంచి ఆవిడ తన నట ప్రస్థానాన్ని ఎదురులేకుండా కొనసాగించింది. ఇలా ఏకంగా తెలుగు, తమిళ్ భాషల్లో మాత్రమే కాకుండా కన్నడ, మళయాళం సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించారు. ఇక తెలుగులో, తమిళంలో ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా టాప్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగు తమిళ్ ప్రేక్షకులకు తన నటనా శైలి తో మంత్రముగ్ధుల్ని చేసింది. ఇవి కేవలం హీరోయిన్లు మాత్రమే కాకుండా 40 సినిమాలకు డైరెక్టర్ గా కూడా పని చేశారు.
ఇక ఈవిడ వివాహ జీవితం చూస్తే… టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో కృష్ణ రెండో భార్య. ఇక్కడ మరో విషయం ఏమిటంటే విజయనిర్మలకు కూడా రెండో వివాహమే. ఇక విజయనిర్మల మొదటగా సినిమాల్లో నటించే సమయంలోనే కృష్ణమూర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన ఓ షిప్ డిజైన్ ఇంజనీర్. వీరిద్దరికీ కలిగిన సంతానమే మనందరికీ తెలిసిన నటుడు నరేష్. వీరిద్దరూ కలిసి తొమ్మిది సంవత్సరాలు వరకు బాగానే సంసారం కొనసాగించిన ఆ తర్వాత విజయనిర్మలకు సినిమాపై ఉన్న ఆసక్తితో వారిద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ ను రెండో వివాహం చేసుకున్నారు. సినిమాల్లో నటించడానికి ఒప్పుకొని ఒక్క కారణం చేతనే విజయనిర్మల తన మొదటి భర్త తో విడిపోయింది.
పౌరాణిక కథలపై తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న…
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ చిత్రాల్లో ఒకటైన రణబాలి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రేమపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. జీవితంలో…
టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ ప్రత్యేకమైన ప్రేమ కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. యవ్వనంలో…
టాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రిద్ధి కుమార్. సహజమైన అందం, సింపుల్…
భారతదేశంలో దేవాలయాలకు వెళ్లినప్పుడు లడ్డూ, పులిహోర, పండ్లు వంటి సంప్రదాయ ప్రసాదాలు అందుకోవడం సాధారణం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని…