Categories: FeaturedMovie News

అజిత్, దేవయానీలను గదిలో బందించి మరీ ఇబ్బంది పెట్టింది ఎవరు..? వారు చేసిన తప్పేంటి !!

చాలామంది సినీ నిర్మాతలు వారు నిర్మించే సినిమాలకోసం బయట ఫైనాన్స్ తీసుకొని సినిమా నిర్మించడం పరిపాటే. అయితే సినిమా హిట్ అయితే పరవాలేదు… కాకపోతేనే బాధ, వారు తీసుకున్న అప్పులు తీర్చలేక, అప్పులకు వడ్డీలు చెల్లించలేక చివరికి ప్రాణాలు తీసుకున్న సంఘటనలు ఎన్నో చూశాం. ఇకపోతే కొన్నాళ్ల కిందట కాలివుడ్ పరిశ్రమపై ఇలాంటి మాఫియా పంజా విసిరింది.

చాలా సంవత్సరాలుగా మదురై అంబు మా ఫి యా ఆ చిత్ర పరిశ్రమను కలిచివేసింది. ఈ మా ఫి యా చేసిన ఆకృత్యాలకు అనేక మంది నటులు దర్శక, నిర్మాతలు బలయ్యారు. ఇకపోతే తమిళ సినీ నిర్మాత అశోక్ కుమార్ బలవాన్మరణం కారణంగా తమిళ పరిశ్రమలో వీరు చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఈ కారణాలకు కారకుడు సినీ ఫైనాన్షియర్ అన్బు చెజియాన్ కారణమని తేలింది. దీంతో అతనిని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు అజ్ఞాతం లోకి జారుకున్నాడు. అయితే ఇతనిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు ఏర్పాటు చేయగా 2011లో అతనిని, అతని సహచరులు మురళి రామకృష్ణుని కూడా బలవంతపు వసూళ్లు నేపథ్యంలో వారిని అరెస్టు చేశారు. దీని ప్రధాన కారణం నిర్మాత అశోక్ కుమార్ బలవాన్మరణం చేసుకోవడానికి కారణం అన్బు చెజియాన్ అని అందులో ప్రస్తావించడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

అయితే ఈ ఫైనాన్సియర్ వల్ల కేవలం దర్శక, నిర్మాతలు మాత్రమే కాకుండా అనేక మంది నటీనటులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ లిస్టులో తమిళ స్టార్ హీరో అయిన అజిత్, హీరోయిన్ గా బాగా పేరు పొందిన దేవయాని లతో సహా అనేకమంది సుప్రసిద్ధ నటీనటులు ఈయన వలలో చిక్కారు. అయితే వీరి ఆకృత్యాలకు అశోక్ కుమార్ కంటే ముందు సీనియర్ నిర్మాత జి. వెంకటేశ్వరన్ కూడా బలవాన్మరణం పొందారు. ఈయన కూడా ఈ ఫైనాన్స్ ము ఠా దగ్గర అప్పు తీసుకొని వాటిని తిరిగి చెల్లించలేక అప్పుల ఊబిలో నుంచి తేరుకోలేక మే 3, 2003 న ప్రాణాలు తీసుకున్నారు. ఇది తమిళ ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. ఈ విషయం గురించి అప్పటి అన్నాడిఎంకె ప్రభుత్వానికి అనేకమంది కంప్లైంట్ చేసిన, ఫైనాన్స్ ము ఠా కి అన్నాడీఎంకేతో సంబంధాలు ఉండడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.

అయితే వీరి ఉచ్చులో తమిళ స్టార్ నటుడు అజిత్ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అది ఎలా అంటే కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత బాల నిర్మించిన నాన్ కడవుల్ చిత్రంలో ఆయన మొదటగా నటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఆ సినిమా నుండి తప్పుకున్నారు. అయితే ఈ సినిమా కోసం అజిత్ కు ముందే కొన్ని డబ్బులు కూడా ఇచ్చారు. అయితే సినిమా నుండి అజిత్ తప్పుకోవడంతో ఒప్పందం ప్రకారం సినిమాల్లో నటించడానికి తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేందుకు అజిత్ అంగీకరించాడు. అయితే ఈ విషయంలో అన్బు చెజియాన్ జోక్యం చేసుకొని ఇంకా వడ్డీ వేసి ఇవ్వాలని అజిత్ ని ఓ రూమ్ లో బంధించి తమిళ పరిశ్రమలో ఓ సంచలనాన్ని సృష్టించారు. ఈ చర్యతో తమిళ సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. ఇక ఆ తర్వాత కొంతమంది సినీ పెద్దల జోక్యంతో ఆ సమస్య అంతటితో ముగిసిపోయింది.

ఇక ఆ తర్వాత సుప్రసిద్ధ నటి దేవయాని కూడా వీరి వలలో చిక్కుకుంది. ఈవిడ కూడా వాడి దగ్గర డబ్బులు తీసుకొని వారి అప్పు తీర్చలేక తన దగ్గర డబ్బు లేకపోవడంతో చివరికి సీరియల్స్ లో కూడా నటించింది. అయితే మరణించిన నిర్మాత అశోక్ కుమార్ కు అన్బు చెజియాన్ ను పరిచయం చేసింది మాత్రం దర్శకుడు బాలా. దీనికి కారణం బాల దర్శకత్వంలో శశి కుమార్ నిర్మాణంలో తెర కెక్కించిన సినిమాతో అశోక్ సహా నిర్మాత గా ఉన్నారు. అయితే ఆ చిత్ర నిర్మించడానికి డబ్బులు అవసరం పడడంతో దర్శకుడు బాల, అశోక్ కుమార్ కు అన్బు చెజియాన్ కు పరిచయం చేశాడు. ఇలా పరిచయం చేయడం ద్వారానే చనిపోయిన నిర్మాత ఫైనాన్స్ తీసుకున్నారు. ఇలా మొదలైన వారి పరిచయం ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా ఆయన దగ్గర మరి కొన్ని సార్లు కూడా వడ్డీకి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వడ్డీ మా ఫి యా చేతిలో పడితే వారి జీవితాలను గొల్ల చేసుకోవాల్సిందే తప్పించి, ఆ ఊబిలో నుంచి బయటికి రాలేరు. కాబట్టి ఏదైనా అప్పు తీసుకునే ముందు ఇచ్చేవారు ఎలాంటి వారు ఒకటికి రెండు సార్లు కచ్చితంగా తెలుసుకున్న తనే వారి దగ్గరనుండి డబ్బులు తీసుకోండి. లేకపోతే జీవితాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago