సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కు వున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ఓవర్సీస్ లో కూడా రజనీ కాంత్ కి పెద్ద మార్కెట్ ఉంది. అలాగే 5 దశాబ్దాల సుదీర్ఘ సినిమా జీవితంలో శ్రీదేవి ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించింది. తన కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు, ఇండియన్ సినీరంగంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కాలంలోనే నటనను వదిలిపెట్టి తను మరణించేంతవరకూ కూడా కుటుంబ బాధ్యతలకే పరిమితమైపోయింది శ్రీదేవి. ఇక అసలు విషయానికి వస్తే..
ఇప్పుడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, శ్రీదేవిల ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. గతంలో మన రజనీకాంత్ అనారోగ్యానికి గురైనప్పుడు బాలీవుడ్ ప్రముఖ నటి శ్రీదేవి 7 రోజుల పాటు ఉపవాసం వుందట. 2011లో ‘రోబో’ చిత్రం షూటింగ్ లో వున్నప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆ తర్వాత అతన్ని సింగపూర్‌లోని ఆసుపత్రికి తరలించారని వార్తలొచ్చాయి. తన ఫ్రెండ్ ద్వారా ఈ సంగతి తెలుసుకున్న శ్రీదేవి..
రజనీకాంత్ వీలైనంత త్వరగా కోలుకోవాలని పూణేలోని సాయి బాబా గుడికి వెళ్లి షిర్డీ సాయి బాబాను ప్రార్థిస్తూ.. 7 రోజులు ఉపవాసం వుందంట. శ్రీదేవి, రజనీ కాంత్ కలిసి గతంలో ‘ముండ్రు ముడిచు’, ‘జానీ’ వంటి కొన్ని సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. ఆగస్టు 13 న శ్రీదేవి 57 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీదేవి ఫ్యాన్స్ మన టాలీవుడ్ అతిలోక సుందరిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను షేర్ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…