తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కోట్లాది మంది ఫ్యాన్స్ గుండెలను కొల్లగొట్టిన అందాల తార త్రిష ఇప్పటికీ సింగిల్ గానే ఉంటోంది. ఆమధ్య అనివార్య కారణాల వల్ల ఆమె పెళ్లి రద్దయినా.. త్రిష ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా.? ఆ శుభవార్త తమకెప్పుడు వినిపిస్తుందా.? అని చాలా మంది సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. లేటెస్ట్ గా హీరోయిన్ త్రిష గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఆ రూమర్స్ సారాంశం ఏమిటంటే..
కోలీవుడ్ హీరోయిన్ నయనతార మాజీ ప్రియుడు హీరో శింబుతో త్రిష పెళ్లికి రెడీ అవుతుందని కోలీవుడ్ టాక్. వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ తో ‘వర్షం’, సిద్ధూతో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ప్రిన్స్ మహేష్ బాబుతో ‘అతడు’, రవితేజతో క్రిష్ణ’, మెగాస్టార్ చిరంజీవితో ‘స్టాలిన్’, టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో ‘కింగ్’ వంటి చిత్రాలలో అగ్రహీరోలందరి సరసన నటించి తెలుగు ప్రేక్షకులందరినీ మైమరిపించిన త్రిష తెలుగులో ఎంతో మంది హీరోయిన్లు తనకు పోటీగా వున్నా.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ చెన్నై చిన్నది. గత 2 దశాబ్దాలుగా సినిమా రంగంలో తిరుగులేని తారగా ఎదగడమే కాకుండా నేటికీ ఎన్నో సినిమా ఆఫర్లను అంది పుచ్చుకుంటూ ముందుకు సాగిపోతుంది మన స్టార్ హీరోయిన్ త్రిష. 2003లో ‘నీ మనసు నాకు తెలుసు‘ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన త్రిష ఆ తర్వాత ‘వర్షం‘ చిత్రంలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.
అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ లలో బిజీగా ఉన్న టైంలోనే త్రిషకు బాలీవుడ్ లో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చింది. ఆవిధంగా ఆమె 2010 సంవత్సరంలో హిందీ చిత్రపరిశ్రమలో అడుగు పెట్టింది. ఓ వైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న త్రిష 2015లో ప్రముఖ బిజినెస్ మ్యాన్ వరుణ మేనియాన్ తో ఎంగేజ్ మెంట్ అయ్యింది. అయితే అనుకోని కారణాల వల్ల వీళ్ళిద్దరి నిశ్చితార్థం రద్దయ్యింది. ఒక ఇంటర్వ్యూలో ఈ నిశ్చితార్థం గురించి మాట్లాడిన త్రిష ‘తాను పెళ్లి చేసుకునే అబ్బాయి పెద్దగా అందగాడు కావాల్సిన అవసరం లేదని, తనను అర్థం చేసుకునేవాడైతే చాలని.. అంతకంటే తాను ఎక్కువగా ఏమి ఆశించడం లేదని, తనకు నలుపు అంటే ఇష్టమని, కాబట్టి తనక్కాబోయేవాడు నల్లగా వున్నా ఫర్వాలేదని’ తెలియజేసింది.
అయితే ఇదే ఇంటర్వ్యూలో ‘ఇంట్లోవాళ్లు చూసే సంబంధాలను అస్సలు పట్టించుకోనని.. తనకు తానుగా ప్రేమించిన వ్యక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి అందరికీ షాకిచ్చింది త్రిష. అప్పట్నుంచి తన పెళ్లి ప్రస్తావన వస్తే చాలు తప్పించుకొని తిరుగుతున్న త్రిష కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ప్రేమలో పడింది. ఆ తర్వాత నయనతారతో ఈ హీరో ప్రేమలో పడ్డాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. శింబుతో ప్రేమాయణం కొనసాగించిన తారలలో హన్సిక, ఆండ్రియా వంటి అందగత్తెలు ఈయన ఖాతాలో ఉన్నారు. మరోవైపు త్రిష కూడా శింబు ఫిలాసఫీనే ఫాలో అవుతూ.. ఆమధ్య టాలీవుడ్ భల్లాలదేవ రానాతో డేటింగ్ చేసిందనే రూమర్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. ఫైనల్ గా హీరోయిన్ త్రిష కోలీవుడ్ స్టార్ హీరో శింబునే పెళ్లి చేసుకుంటుందని తాజా సమాచారం. మరి ఈ వార్తలలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…