‘ఏంటీ మన టాలీవుడ్ చందమామ కాజల్ నిశ్చితార్థం రహస్యంగా జరిగిపోయిందా.?’ సోషల్ మీడియా దగ్గర్నుంచి ఫిలిం నగర్ వరకూ ఎక్కడ చూసినా.. విన్నా ఇప్పుడు కాజల్ ఎంగేజ్ మెంట్ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్యనే నిహారిక నిశ్చితార్థం వేడుకను మర్చిపోకముందే కాజల్ కి నిశ్చితార్థం జరిగిపోయినట్లు తెలియడంతో నెటిజన్లు షాకయ్యారు. అయితే ఈ విషయాన్ని మీడియాకు తెలియనివ్వకుండా కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు టాలీవుడ్ సమాచారం.
ఇక కాజల్ అగర్వాల్ ఎంగేజ్ మెంట్ వివరాల్లోకి వెళ్తే.. గౌతమ్ అనే వ్యక్తితో కాజల్‌కి నిశ్చితార్థం జరిగిందని లేటెస్ట్ అప్ డేట్. అంతేకాదు అత్యంత రహస్యంగా జరిగిన ఈ నిశ్చితార్థం వేడుకకు టాలీవుడ్ నుంచి కాజల్ బెస్ట్ ఫ్రెండ్ బెల్లంకొండ శ్రీనివాస్ హాజరయ్యారట. కవచం, సీత చిత్రాలలో కలిసి నటించిన ఈ ఇద్దరి మధ్య మంచి మైత్రి కొనసాగుతుండగా.. ఈ కార్యక్రమానికి అతడిని మాత్రమే ఆహ్వానించిదట కాజల్. మరి ఈ రూమర్స్ పై మన టాలీవుడ్ చందమామ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘సీత’ చిత్రంలో నటించింది కాజల్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన సంగతి తెలిసిందే. అయితే సినిమా హిట్, ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రస్తుతం కాజల్ చేతి నిండా సినిమా ఆఫర్లలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 2, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ లో 2 చిత్రాలతో బిజీగా వున్న కాజల్ ఆమధ్య నటించిన క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఈవిధంగా ఒక్క సినిమాలే కాకుండా ఎంత ఫుల్ బిజీగా ఉన్నా సరే కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడు హాట్ హాట్ గా ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది. వీటితో అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని ఈ భామ సంపాదిస్తుందనే టాక్ వినిపిస్తుంది. దానికి తోడు వెబ్ సిరీస్ వైపు కూడా అడుగులు వేస్తుంది కాజల్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో కాజల్ ఓ వెబ్ సిరీస్ చేస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…