Nagachaitanya -Sobitha: నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం వీరిద్దరూ వారి కెరీర్ పై దృష్టి పెట్టారు. అయితే గత కొన్ని రోజులుగా నాగచైతన్య గురించి సోషల్ మీడియాలో రెండవ పెళ్లి వార్తలు పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నటి శోభితతో నాగచైతన్య డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఊపందుకున్నాయి.
ఈ క్రమంలోనే నాగచైతన్య శోభితా పరిచయం ఎక్కడ మొదలైందని పెద్ద ఎత్తున నెటిజన్లు ఆరాతీస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య పరిచయం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిందని తెలుస్తోంది.వీరిద్దరి కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం వెళ్లడంతో ఈ పార్టీలో నాగ చైతన్య, శోభిత మధ్య పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ వరకు దారితీయడంతో ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు పెద్దఎత్తున వినపడుతున్నాయి.
ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయంతో తరచూ వీరిద్దరూ కలవడం పార్టీలు చేసుకోవడం జరుగుతుందని ఇలా వీరిద్దరూ తరచూ కలవడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి గురించి ఇలా వార్తలు రావడంతో శోభిత ఈ వార్తలపై స్పందిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో ఈమె మిడిల్ ఫింగర్ చూపిస్తూ అందరికీ సమాధానం చెప్పకనే చెప్పారు.
డేటింగ్ రూమర్స్ పై స్పందించని చైతన్య…
ఇక ఈ విషయంపై నాగచైతన్య ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఆయన నటించిన థాంక్యూ సినిమా జూలై 22వ తేదీ విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను జూలై రెండవ వారం నుంచి మొదలు పెడతారు.బహుశా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శోభిత విషయం గురించి నాగచైతన్య స్పందించి ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చిన అవకాశాలు ఉన్నాయి. ఇక శోభిత గూడచారి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తాజాగా మేజర్ సినిమాతో మరో హిట్ కొట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…