మాస్ లుక్‌లో కనిపించి విలన్‌లను ఉతికి పారేయడం హీరోయిన్‌లతో రోమాన్స్ చేయడమే కాదు. దేవుళ్ళగా కనిపించి కరునించే పాత్రల్లోనూ టాలీవుడ్ హీరోలు తీసిపోరని నిరూపించారు. అప్పట్లో రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి పాత్రల్లో సీనియర్ ఎన్టీఆర్ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఓ రకంగా దేవుడంటే ఎన్టీఆర్ అనే స్టార్‌డమ్ ఆయన సొంతమయ్యింది.
చాలా వరకు పౌరాణిక, ఆధ్యాత్మిక చిత్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ దేవుళ్ల గెటప్‌లు వేసి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. ఆ తరువాత అందగాడు శోభన్ బాబు రాముడి పాత్రలో కనిపించి కనువిందు చేశారు ఆ తరం ముగిసిన తరువాత నేటి స్టార్ హీరోలు కొన్ని ఆధ్యాత్మిక చిత్రాల్లో దేవుళ్ళ గా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
ఆపద్భాందవుడు చిత్రంలో ఓ పాటలో శివుని గెటప్ వేసుకుని అలరించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రంలో ఈ పాట హైలెట్ అవ్వడం శివుని వేషధారణలో అందరినీ అట్రాక్ట్ చేయడంతో 2001లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీ మంజునాథ చిత్రంలో చిరంజీవి శివుని పాత్రలో నటించారు. పార్వతిగా మీనా నటించింది. తెలుగులోనే కాదు కన్నడ భాష లోనూ శ్రీ మంజునాథ విడుదలైంది. కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థలంలోని శ్రీ మంజునాథేశ్వర క్షేత్రం ఆధారంగా తీసిని ఈ సినిమాలో శివుని పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశారు చిరంజీవి. ఈ చిత్రంలో ఆయన నాట్యం కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం చిత్రంలో బాలకృష్ణ రాముడు పాత్రలో నటించారు. సీతగా నయనతార నటించింది. ఈ చిత్రంలో శ్రీరామచంద్రుడి పాత్రను తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు బాలయ్య. ఇక సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై 2015లో వచ్చిన చిత్రం గోపాల గోపాల.
ఈ చిత్రంలో వెంకటేష్, పవన్‌కళ్యాణ్‌లు నటించారు. మోడ్రన్ కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ నటించి ప్రేక్షకులను మెప్పించారు.
హీరో సుమన్ కూడా దేవుడి పాత్రలకు కరెక్ట్‌గా సూట్ అవుతారని నిరూపించారు. అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లో కలియుగ వెంకటేశ్వర స్వామి రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.
అక్కినేని నాగార్జున, శ్రీకాంత్, శ్రీహరి, కమలినీ ముఖర్జీ, అనంత్ తారాగణంలో 2012లో వచ్చిన సినిమా శిరిడిసాయి. ఈ చిత్రంలో సాయిబాబా గెటప్ లో కనిపించారు హీరో నాగార్జున. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాల్లో నాగార్జున సాయిబాబా గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అప్పటి వరకు సినిమాల్లో మాస్ లుక్‌లో, మన్మథుడిగా, డాన్‌గా కనిపించిన నాగార్జున ఒక్కసారిగా బాబా పాత్రలో కనిపించడం కాస్త ఇబ్బంది పెట్టినా.. సినిమాలో ఆయన నటను చూసి మైమరిచారు ప్రేక్షకులు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు వచ్చిన సమయంలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినప్పటికీ సినిమా విడుదల అనంతరం నాగార్జున ఆధ్యాత్మిక కథల్లోనూ తనదైన శైలిలో నటించి మెప్పించగలరని నిరూపించారు. కలియుగ దైవమైన సాయిబాబా పాత్రలో ఒదిగిపోయారు.
తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా దేవుడి పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్ తీస్తున్న వాల్మీకీ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాల్లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. ఆనాటి నుంచి నేటి తరం వరకు చాలా మంది స్టార్ హీరోలు దేవుళ్లుగా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను తమ నటనతో కట్టిపడేస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…