Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్... ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..
Google: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చింది. ఒక్క మొబైల్ చాలు అంతా మన చేతిలోకి వస్తోంది. ఇంతా సెల్ ఫోన్ వినియోగం పెరిగింది. ఇదిలా ఉంటే సెల్ ఫోన్ల వల్ల వచ్చే సెక్యురిటీ త్రెట్స్ కూడా పెరిగాయి. యూజర్ల ప్రైవసీ విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించినా..మన సున్నిమైన సమాచారం దొంగల చేతికి వెళ్లిపోయే ఆస్కారం ఉంది.
ప్రస్తుతం తన వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. యూజర్ల ప్రైవసీ పాలసీ విషయంలో భారీ మార్పులు తీసుకురాబోతోంది.
ఆపిల్ తరహా సెక్యురిటీ ఫీచర్లను ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందించనుంది. ఐఓఎస్ తరహా ఫీచర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఐఫోన్లకు అందించే ఫీచర్లను ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లకు తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2021లో ఎప్రిల్ లో ఐఫోన్ యూజర్ల కోసం కొత్త యూజర్ ప్రైవసీ పాలసీని ఆపిల్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ సదరు యూజర్ ని ట్రాక్ చేయకుండా ఉండేలా కొత్త ఫీచర్ ని ఆపిల్ అందిస్తోంది.
అయితే ఇప్పుడు అదే తరహాలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఇలాంటి ఫీచర్ ను గూగుల్ తీసుకురాబోతున్నట్లు తెలిసిొంది. ప్రైవసీ పాలసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్ ప్రోడక్ట్ మెనేజ్మెొంట్ ఉపాధ్యక్షుడు ఆంథోనీ చవెన్ ఓ బ్లాక్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రైవేటు అడ్వర్టయిజింగ్ సోల్యూషన్లు, కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇక థర్డ్ పార్టీలతో డాటా షేర్ చేయడాన్ని తగ్గిస్తామని వెల్లడించారు. అయితే ఈ మార్పలు అందుబాటులోకి తీసుకురావాటంలే కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని ఆయన అన్నారు. థర్డ్ పార్టీ యూజర్లు షేర్ చేసే అంశంలో గూగుల్ కొత్త ప్రైవసీ సాండ్ బాక్స్ ఫీచర్ను తీసుకురానుంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…