Featured

అల్లు అర్జున్ కు ఇష్టమైన డ్యాన్సర్ ఎవరో తెలుసా.. తన మనస్సులో మాట బయట పెట్టిన బన్నీ..

అల్లు అర్జున్ దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడల్లా.. సెల్ఫీలు దిగడానికి వెంట పడతారు. అది రాజస్థాన్ అయినా కేరళ అయినా. అతడికి ఎక్కువగా తమిళం, కన్నడలో తెలుగులో ఉన్నంత ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కువగా అతడి సినిమాలు, స్థానిక భాషలలోకి డబ్ చేయబడ్డాయి. అందుకే అతడికి ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉంటుంది.

ఇక పుష్ప మూవీపై అంచానాలు పీక్స్ లో ఉన్నాయి. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ బాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. సుకుమార్, బన్నీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ కాంబినేషన్ మూవీని డిసెంబర్ 17న విడుదల కానుంది. ఇప్పటికే మూవీలోని అన్ని పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సమంత ఐటెం సాంగ్ కూడా ఆడియన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చింది. ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా అంటూ సాగే ఈ పాట ఇప్పుడు జనాలను అలరిస్తోంది. 

ఇప్పటికే ప్రమోషన్ పనుల్లో బిజీ ఉన్న పుష్ప టీం.. సినిమాకు చివరి మెరుగులు దిద్దుతున్నారు. ఈ సందర్భంగా అతడు తమిళ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. తన సినిమాలు చాలా వరకు డబ్ అయ్యాయని.. దీంతోనే ఎక్కువగా హిందీ ప్రేక్షకులకు దగ్గర అయ్యాను అని చెప్పుకొచ్చాడు. పరోక్షంగా బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయిన తను.. ప్రత్యక్షంగా మొదటి సారి పుష్ప సినిమా ద్వారా వస్తున్నానని.. అయినా తాను తమిళనాడలో గెలవాలనుందని మనసులో మాట బయటపెట్టారు.

ఇప్పడికే పుష్ప సాంగ్స్ కోలివుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయన్నారు. ఇంతటి ఘనత సాధించడానికి కారణం దేవీశ్రీప్రసాద్ అని.. అతడికి ఎప్పటికీ రుణ పడి ఉంటానన్నాడు. ఇక టాలీవుడ్ లో డ్యాన్స్ తో ఎక్కువగా అలరించే హీరోల్లో చెప్పుకోదగిన హీరో అల్లు అర్జున్ . నీకు ఇష్టమైన డ్యాన్స్ ఎవరు అని ప్రశ్నకు అతడు ఇలా సమాధానం చెప్పాడు. తమిళంలో అయితే.. కమల్‌ హాసన్‌, విజయ్‌, ధనుష్‌, శింబు, శివకార్తికేయన్‌ బాగా డ్యాన్స్‌ చేస్తారని అతడు చెప్పుకొచ్చాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago