Featured

Jr NTR Son: నందమూరి వారసుడు అభయ్‌కి నచ్చిన హీరో ఎవరో తెలుసా.. ?

Jr NTR Son: ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ సూపర్ డూపర్ హిట్ కావటం, రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టడంతో స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పేర్లు ప్రపంచవ్యాప్తంగా మారు మోగుతున్నాయి. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా నటించారు. చరణ్… ఎన్టీఆర్ పాత్రలను ఎంతో బ్యాలెన్స్ గా చూపించడం, అందుకు తగ్గట్టుగానే తమ హావ భావాలతో మరోసారి ప్రేక్షకులను ఈ ఇద్దరు హీరోలు ఆకట్టుకున్నారు.

Jr NTR Son: నందమూరి వారసుడు అభయ్‌కి నచ్చిన హీరో ఎవరో తెలుసా.. ?

ముఖ్యంగా కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ నటనకు చాలామంది ఫిదా అయిపోయారు. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తారక్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందంటూ ఆయన్ని కీర్తిస్తున్నారు.ఇక ఈ మూవీపై పలువురు సెలబ్రెటీలు సైతం ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

Jr NTR Son: నందమూరి వారసుడు అభయ్‌కి నచ్చిన హీరో ఎవరో తెలుసా.. ?

కాగా ఈ విజయంతో ముందుకు సాగుతున్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఒక్కోసారి సినీ తారలు పాపులారిటీని గడిస్తే, వారి పిల్లల గురించి కూడా ప్రేక్షకులు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగానే ఆయన పిల్లల గురించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా నందమూరి ఫ్యాన్స్ సంతోషిస్తారు.

సంతోషంలో మహేష్ అభిమానులు…

తాజాగా అలాంటి అప్‌డేటే ఇప్పుడు వచ్చింది. తారక్ గారాల కుమారుడు అభయ్ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మామూలుగా తల్లిదండ్రులు సెలబ్రెటీలు, స్టార్ హీరో, హీరోయిన్ల పిల్లలు కూడా వారిని ఫెవరేట్ హీరో, హీరోయిన్లుగా భావిస్తారు. మరికొంత మంది మాత్రం భిన్నంగా వేరే వాళ్లను అభిమాన తారలుగా సెలెక్ట్ చేసుకుంటారు. అయితే తాజాగా ఎన్టీఆర్ కుమారుడు అభయ్ కూడా తనకు ఫెవరేట్ హీరో ఎవరూ అంటే ప్రిన్స్ మహేశ్ బాబు అని, ఆయన చేసిన బిజినెస్‌మెన్ సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని వెల్లడించాడు. ఈ విధంగా ఎన్టీఆర్ కుమారుడు అభయ్ తన ఫేవరెట్ హీరో మహేష్ బాబు అని చెప్పడంతో మహేష్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago