Actress Garima: పబ్ ఘటనలో లక్షల విలువ చేసే ఫోన్ పోగొట్టుకున్న నటి!
Actress Garima: సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎక్కువగా రాత్రి సమయాలలో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకోవడం,పబ్ లకు వెళ్లి ఎంజాయ్ చేయడం చేస్తుంటారు. ఇలా అర్ధ రాత్రి వరకు పబ్ లో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటారు. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పబ్ వ్యవహారం సంచలనంగా మారిందో మనకు తెలిసిందే.
తాజాగా పబ్ కి సంబంధించిన మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈసారి పబ్ లో ఎలాంటి మాదకద్రవ్యాల గురించి కానీ లేట్ నైట్ పార్టీల గురించి కాదండోయ్.. ఒక దొంగతనానికి సంబంధించిన వార్త హల్ చల్ గా మారింది. స్నేహితులతో కలిసి నటి పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలోనే సదరు నటి లక్ష రూపాయల విలువ చేసే ఫోన్ ఎవరో దొంగతనం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్ గరిమా జైన్‌కు ముంబై లోని ఒక ప్రముఖ పబ్ లో ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉన్న పబ్ కి నటి గరిమా ఏప్రిల్ 2వ తేదీ స్నేహితులతో కలిసి వెళ్లారు. ఇలా పబ్ లో ఎక్కువ సమయం పాటు తన స్నేహితులతో కలిసి గడిపిన ఈమె తెల్లవారుజామున 3.15 గంటలకు ఇంటికి వెళ్లాలని బయలుదేరారు.
ఈ సమయంలో తన స్నేహితులకు ఫోన్ చేయాలని తన ఫోన్ కోసం వెతకగా తన ఫోన్ కనిపించలేదు. ఇలా ఎంత వెతికినా ఫోన్ దొరకకపోవడంతో తన ఫోన్ ఎవరో దొంగిలించారని భావించిన ఈమె ఎంతో ఆందోళన చెందారు.అయితే ఈ నటి పోగొట్టుకున్న ఆ ఫోన్ ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు కావడంతో సదరు నటి తీవ్ర ఆందోళన చెంది వెంటనే పబ్ నిర్వాహకులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా పబ్లిక్ కి వెళ్లి లక్ష రూపాయల ఫోన్ పోగొట్టుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…