Rashmika: నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. ఈమె పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్గా ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి రష్మిక తెలుగులో కూడా వరుస సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా వరుస తెలుగు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ఈ సినిమా ద్వారా ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ రావడంతో బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇలా బాలీవుడ్ సినిమాలలో కూడా ఎంతో బిజీ అయ్యారు.
తాజాగా ఈమె యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అయింది. ఇదిలా ఉండగా తాజాగా రష్మికకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మికకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ఉన్నారని ఆయన మరెవరో కాదు ఎన్టీఆర్ అంటూ ఈ వార్త వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ నటన అద్భుతం..
ఎన్టీఆర్ డాన్స్ అంటే మీకు చాలా పిచ్చి అని తన నటన చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ ఒకానొక సందర్భంలో రష్మిక ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టం అనే విషయం గురించి వెల్లడించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అంటూ ఈమె తన మనసులో ఉన్నటువంటి మాటను కూడా బయటపెట్టారు. మరి ఎన్టీఆర్ తో ఈమెకు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తుందా రాదా వేచి చూడాలి.
ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ రోజుల్లో, ఆహారంలో చిన్న మార్పులే పెద్ద ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన…
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరిగింది. సాయంత్రం అయ్యాక సమోసా, పానీపూరీ, బర్గర్,…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ఉద్యోగ సమయాలు కూడా పెద్దగా మారిపోయాయి. ఐటీ, హెల్త్‌కేర్, సర్వీస్ రంగాల్లో పని చేసే చాలా…
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…