Kite-Young Boy: ఆకాశంలో ఎగురుతున్న రంగురంగుల గాలిపటాలను మీరు చాలానే చూసి ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. శ్రీలంకలోని జఫ్నాలో పాయింట్ పెడ్రోలో కొందరు యువకులు గాలిపటం ఎగరేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందులో ఓ వ్యక్తి గాలిపటంతో పాటు ఎగిరాడు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల శ్రీలంకలోని జాఫ్నాలో గాలిపటాలు ఎగరేయడం పోటీ జరుతున్న సమయంలో కొంతమంది యువకులు ప్రాక్టీస్ చేశారు. అందులో ఓ వ్యక్తి తన జట్టులోని మిగిలిన సభ్యులతో కలిసి తాడును పట్టుకుని పెద్దగా గాలిపటాన్ని విసిరేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది .
గాలి చాలా బలంగా వీస్తోంది. గాలిపటం వెంటనే గాలిలో ఎగరడం ప్రారంభించింది. దీంతో తాడు పట్టుకున్న మిగిలిన సభ్యులు ఒక్కసారిగా ఆ తాడును వదిలేశారు. కానీ అందులో ఓ వ్యక్తి ఆ తాడును వదలలేదు. దీంతో అతడు ఆ గాలిపడంతో పాటు.. ఆ తాడు పట్టుకొని.. భూమి నుండి 30 అడుగుల ఎత్తులో లేచాడు. ఇలా గాలిపటం తాడు పట్టుకొని వేళాడుతూ ఉండిపోయాడు. నిమిషంపైగా అతను వేలాడుతుండగా.. అతని స్నేహితులు కింద నుంచి తాడు వదిలేయాలంటూ కేకలు వేశారు.
అక్కడ చూస్తున్న మిగతా వారికి చాలా భయం వేసింది. అతడు ఎక్కడ కిందపడతాడో.. ఎంత ఎత్తుకు వెల్లిపోతాడో అని భయపడ్డారు. తర్వాత గాలి కొద్దిగా తగ్గడం.. గాలిపటం కాస్త కిందకు రావడంతో.. ఇలా మళ్లీ గాలిపటం మరింత ఎత్తుకు లేచేలోగా అతను తాడు వదిలేసి కింద పడిపోయాడు. అదృష్టవశాత్తూ అతనికి ఏం కాలేదు.. కానీ చిన్ని చిన్న గాయాలు అయ్యాయి. ఈ ఘటన మొత్తం పక్కనే ఉన్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది బాగా వైరల్ అయిపోయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…