Disney+ Hotstar: డిస్నీ+హాట్ స్టార్ యూజర్లలకు గుడ్ న్యూస్.. కొత్త ఆఫర్ అందుబాటులోకి..!
Disney+ Hotstar: ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్ స్టార్ గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. మొదట దీని సబ్ స్క్రిప్షన్ పొందాలంటే.. నెలకు రూ.399లతో జియో రిచార్జ్ చేస్తే.. అటు రిచార్జ్ తో పాటు.. ఇటు సబ్ స్క్రిప్షన్ కూడా వచ్చేది. ఇలా ఆ రిచార్జ్ చేస్తే.. సంవత్సరం వరకు డిస్నీ+హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ వచ్చేది. అయితే ఇటీవల దాని ధరను పెంచారు. ప్రస్తుతం రూ.399 నుంచి రూ.499కి పెంచారు.
ఇక తాజాగా మరో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ నెలకు రూ. 49 నుండి ప్రారంభమవుతుంది. రూ.49 పెట్టి మెంబర్‌షిప్ తీసుకుంటే నెల వరకు మొబైల్‌లో అన్నింటికీ యాక్సెస్ లభిస్తుంది. అయితే.. ఈ ఆఫర్ కొందరికే తీసుకొచ్చింది హాట్‌స్టార్. దీనిని కేవలం సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది అంటూ స్క్రీన్ షాట్ లు వైరల్ అవుతున్నాయి.
చాలామంది యూజర్లు ఆ ఆఫర్‌ను చూసి చెక్ చేసుకుంటే.. వాళ్లకు ఆ ఆఫర్ కనిపించడం లేదు. అయితే అంతకు ముందు ఇది రూ.99లకు అందుబాటులో ఉండేది. ఇలా సంవత్సరానికి ఎక్కువగా మొత్తంలో ఖర్చు అయ్యేది. అందుకే ఈ ప్లాన్ తీసుకోవడంతో మొబైల్ యూజర్లు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక సంవత్సరానికి అయితే రూ.499 ప్లాన్ ఉంది. ఈప్లాన్ లో ఎలాంటి యాడ్స్ లేకుండా.. ఇబ్బంది లేకుండా సినిమాలు, షోలను వీక్షించవచ్చు.
హెచ్‌డీ స్ట్రీమింగ్, స్టీరియో ఆడియో క్వాలిటీ ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనేది తెలుగులో మంచి ఆదరణ ఉంది. చాలామంది ఈ ఓటీటీని కలిగి ఉన్నారు. అయితే నెట్‌ఫ్లిక్స్ విషయానికి వస్తే.. తెలుగులోను కాదు.. ఇండియ వైడ్ గా కూడా ఇది అంత ఆదరణ లేదనే చెప్పాలి. ఇండియాలో నిలదొక్కుకోవడం కోసం ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్ ధరలను తగ్గించింది. దీంతో అప్రమత్తమైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తాజాగా కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…