Featured

Doctor Harshavardhan Yepuri : కన్నీళ్లు పెట్టిస్తున్న డాక్టర్స్ హర్షవర్ధన్ కథ… చనిపోతానని ముందే తెలిసి అన్ని సిద్ధం చేసిన హర్ష…!

Doctor Harshavardhan Yepuri : ఈ భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా మరణించక తప్పదు. వైద్యం ఎంత అభివృద్ధి చెందినా మన మరణాన్ని ఆపలేదు. అందరం మరణించే వాళ్ళమే అయినా కొంచం ముందు వెనుక వెళ్తాము. కానీ ఆ మరణం మనకు ఎపుడు వస్తుందో తెలియకుండా బ్రతికేస్తున్న మనకు మన మరణం పలానా రోజు అని తెలిస్తే ఎలా జీవిస్తాం. మన ఎక్స్పైరి డేట్ తెలిస్తే బతకాగలమా, నిరాశలో ఉండిపోతామా, ఇలాంటి పరిస్థితి ఖమ్మంకి చెందిన డాక్టర్ హర్షవర్ధన్ కి ఎదురైంది. తాను మరణించేదెపుడో డాక్టర్లు చెప్పేసినా ఏ మాత్రం అధైర్య పడకుండా చావును చిరునవ్వుతో ఆహ్వానించాడు హర్ష. మరణాన్ని కూడా ఎంతో పద్దతిగా తన అనుకున్నవాళ్లకు భారం కాకుండా ఎవరి కంటా కన్నీళ్ళు రాకుండా తాను మానసికంగా దృఢంగా ఉండటమే కాకుండా తన వాళ్లను సిద్ధం చేసి వెళ్ళాడు, మనందరికీ స్ఫూర్తి నింపాడు డాక్టర్ హర్ష వర్ధన్.

అమ్మ నేను బ్రతకను అని ఫోన్ చేసి ఏడ్చాడు…

డాక్టర్ హర్షవర్ధన్.. ఖమ్మకి చెందిన 32 ఏళ్ల ఈ యువకుడు చదువులో ఎపుడూ ఫస్ట్, అలానే డాక్టర్ గా ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం, లైఫ్ సెటిల్ అయింది. ఇక జీవితంలో అత్యంత మధిర ఘట్టం పెళ్లి, సింధు అనే ఒక అమ్మాయిని చూసి నచ్చి తనతో లాక్ డౌన్ కి ముందు వివాహం కూడా గ్రాండ్ గా చేసుకున్నాడు హర్ష. పెళ్లయ్యాక ఒక నెల పాటు ఉండి ఆపైన వీసా గడువు ముగియడంతో ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అయితే అదే సమయంలో లాక్ డౌన్ వల్ల సింధు హర్ష వద్దకు వెళ్లలేకపోయింది. ఎపుడూ ఫిట్ గా ఉండి శుభ్రంగా ఉండాలనిందరికీ చెప్పే హర్ష జిమ్ చేస్తుండగా ఆయాసం రావడంతో స్వాతహగా డాక్టర్ అయిన తాను పరీక్షలు చేసుకోగా క్యాన్సర్ మహమ్మారి సోకినట్లు తేలింది. క్యాన్సర్ అని తెలిసాక ఇండియా రావడానికి కానీ ఇండియా నుండి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళడానికి వీలు లేని సమయంలో తనలో తానే కుమిలి పోయాడు. తనకు క్యాన్సర్ అని తల్లికి చెప్పి ఏడ్చేసాడు. అయినా భయపడకుండా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపి భరోసా ఇచ్చాడు. అయితే మొదట్లో చికిత్సకు క్యాన్సర్ తగ్గుముఖం పట్టినా అప్పటికే లివర్, కిడ్నీ కి ఊపిరి తిత్తుల నుండి క్యాన్సర్ సోకి బ్రెయిన్ కి కూడా పాకడంతో తన మరణం తప్పదని హర్షకి అర్థమైంది.

అయితే ఇక్కడే హర్ష అందరిలా కాకుండా తానేంటో ప్రపంచానికి చూపాడు. తన వల్ల తనని పెళ్లి చేసుకున్న అమ్మాయి బాధపడకూడదని తనని ఒప్పించి విడాకులు తీసుకుని మరణించేవరకు స్నేహితులుగా ఉందామని చెప్పి ఒప్పించాడు. ఆ అమ్మాయి అమెరికా లో చదువుకునే ఏర్పాట్లు చేసి అమెరికా పంపాడు. ఇక నిరంతరం తన జీవితం అస్వాదించడం నేర్చుకున్నాడు. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో తన వైద్య సేవలను అందిస్తూ వారితో గడుపుతూ సంతోషం వెతుక్కున్నాడు. తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వస్తామని చెప్పినా తాను కిమో తీసుకోవడం వల్ల తాను పడుతున్న బాధ వాళ్ళు చూడలేరని వద్దని చెప్పాడు. చివరిగా ఇండియా వచ్చి తల్లిదండ్రులతో పదిహేను రోజులు గడిపి అపై మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఈసారి డాక్టర్లు తాను మరణించబోయే తేదీని చెప్పేసారు. మార్చి 27 లోపు మరణించవచ్చని తెలిపారు. ఇక హర్ష తన మరణం తరువాత పేరెంట్స్ ఇబ్బంది పడుకూడదని భావించి తన శవపేటిక కూడా సిద్ధం చేయించాడు. లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా తన స్నేహితులకు అనుమతి ఉండేలా అన్నీ సిద్ధం చేసాడు. తాను మరణించే ముందు రోజు తాను పనిచేస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ వారితో గడిపి వాళ్లకు వీడ్కోలు పలికాడు. ఇక ఇంట్లో తన స్నేహితుడితో ఉన్న హర్ష మరణించే రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పి కాఫీ తాగాలని ఉంది అని ఫ్రెండ్ కి చెబితే మళ్ళీ వెళదాం అని తన ఫ్రెండ్ చెప్పడంతో తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి కాఫీ తాగి వచ్చాడు. ఇంటికి వచ్చాక బాత్రూం వెళితే మూత్రంలో రక్తం రావడంతో తన చావు సమీపిస్తోందని అర్థమై స్నేహితులతో తాను కాసేపు పడుకుంటానని చెప్పి వెళ్లి పడుకున్న రెండు నిమిషాలకే హర్ష మరణించాడు. ఇక హర్ష గురించి తల్లిదండ్రులు చెబూతూ కన్నీటిపర్యంతం అయిపోయారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago