Actress Tiger Radha Prashanthi : అవకాశాలు వచ్చినా అవి మన వరకు చేరాలన్నా అదృష్టం ఉండాలి. ముఖ్యంగా సినిమా రంగంలో ఒక ఆఫర్ మనకు వచ్చినా అది చెజారితే జరిగే నష్టం మన కెరీర్ మీద ప్రభావం చూపుతుంది. అలానే సహాయక పాత్రలతో పేరు తెచ్చుకున్న రాధా ప్రశాంతి విషయంలో కూడా జరిగింది. శ్రీకాకుళం పర్లాకిమిడి పక్కన గ్రామంలో జన్మించిన రాధా ప్రశాంతి ఒరిస్సా రాష్ట్రంలోని గ్రామంలో జన్మించింది. అయితే శ్రీకాకుళం అనగానే గుర్తొచ్చేది కళాకారులు అలా చిన్నతనం నుండే నాటకాలు వేసిన అనుభవం ఉన్న రాధా ప్రశాంతికి మొదట జపతి ఆర్ట్స్ బ్యానర్ లో జగపతి బాబు మొదటి సినిమాలో సెకండ్ హీరోయిన్ అవకాశం రాగా సెలెక్ట్ అయ్యాక బైక్ లో వెళ్తూ ఆక్సిడెంట్ అవడం వల్ల అవకాశం మిస్ అయిందట. అలా కొన్ని అవకాశాలు కెరీర్ మీదే ప్రభావం చూపుతాయి అంటూ చెబుతున్నారు రాధా ప్రశాంతి.
అమ్మే ఎలా బతకాలో నేర్పింది…
రాధా ప్రశాంతి గారికి బ్రేక్ ఇచ్చిన సినిమా సుమన్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన ‘పరువు ప్రతిష్ట’ సినిమా. అందులో హీరోకి అక్కగా చేసిన ఆమె ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆమె కెరీర్ బాగా ఉన్నపుడే పెళ్లి చేసుకున్నారు. అయితే భర్తకు ఆస్తులు బాగా ఉన్నా అవి ఉమ్మడి ఆస్తులు కావడం, వచ్చినా అవి నీ పిల్లలకు మాత్రమే అవి నీవు కాదు వాటి మీద ఆధారపడకు అని మా అమ్మ చెప్పేది. చిన్నతనం నుండే ఆత్మాభిమానంతో బతకాలని అమ్మ నేర్పింది.
ఆందుకే పెద్ద ప్రొడక్షన్స్ లో చాలా సినిమా అవకాశాలు పోయాయి కూడా అంటూ చెప్పారు రాధా ప్రశాంతి. ఇక పెళ్లయ్యాక భర్తకు సినిమాల్లో నేను నటించడం ఆ పరిస్తుతులు ఇష్టం లేకపోవడం వల్ల మానేసానని ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళైపోయారు ఇప్పుడు ఎలాంటి అడ్డంకులూ నటించడానికి లేకపోయినా అవకాశాలు రావాలి కదా అంటూ తెలిపారు. ఇక టైగర్ రాధా ప్రశాంతి గారు చేసిన సోషల్ ఆక్టివిటీస్ కి గాను ఆమెకు రాష్ట్రపతి పురస్కారం లభించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…