తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. ఇది ఒక్క తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ మరియు ఇతర భాషల్లో కూడా రన్ అవుతోంది. తెలుగులో మాత్రం ఎండ్ కార్టు పడటానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో హౌజ్ లో ఉన్న వాళ్లతో బిగ్ బాస్ అంతక ముందు ఇచ్చిన టాస్క్ లు ఇస్తూ.. వాళ్లతో కామెడీ యాంగిల్ ను తీసుకొస్తున్నాడు.
ఈ క్రమంలో నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా ప్రతీ ఒక్కరూ టాస్క్ లను మరో సారి ఆడి.. చిన్న చిన్న గిఫ్ట్ లను గెలుచుకున్నారు. అందులో మొదటగా షణ్ముఖ్.. బెలూన్ లను ఊది.. అవి పగిలేవిధంగా చేసే టాస్క్ లో గెలుస్తాడు. అతడు ఆ టాస్క్ గెలిచిన తర్వాత ఒక కూల్ డ్రింక్ ను బహుమతిగా గెలుస్తాడు. ఇక రెండో టాస్క్ లో స్విమ్మింగ్ ఫూల్ లో లేబుల్ లేదు మచ్చా అనే టాస్క్ లో మానస్ గెలిచి.. చాక్లెట్లను బహుమతిగా గెలుస్తాడు. తర్వాత టాస్స్ లో సౌండ్స్ ను గుర్తించి రాయాలి.. ఈ టాస్క్ లో కామెడీ విపరీతంగా పండిందనే చెప్పాలి.
చివరగా రోప్ వేవ్స్ టాస్క్ ని సిరి, సన్నీ, ఇంకా షణ్ముక్ లతో ఆడించాడు. ఈటాస్క్ లో సిరి ముందుగానే చేతులు నొప్పి పుట్టి వదిలేసింది. ఆ తర్వాత షణ్ముక్ అండ్ సన్నీ ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా చాలా సీరియస్ గా ఈ టాస్క్ ఆడారు. అయితే చివరి వరకు ఉన్న సన్నీ.. మధ్యలో ఆ తాడుతో వేవ్స్ రాకపోవడంతో సిరి బయట నుంచి కామెంట్ చేయడం మొదలుపెట్టింది. అయినా చివరకు సన్నీ విన్నర్ అయ్యాడు. ఇక్కడ సిరికి మరియు సన్నీకి మధ్య వాగ్వాదం పెరిగింది. నువ్వు గేమ్ గెలిచావ్ కానీ, వేవ్స్ రాలేదు అంటూ మాట్లాడింది.
సన్నీ నువ్వు ఓడిపోయావ్ కదా అంటూ మాట్లాడేసరికి ఓడిపోయావ్ అని అనొద్దని సీరియస్ గా చెప్పింది సిరి. జోక్ గా అన్నాను మచ్చా అన్నా గానీ ఆ వ్యవహారం తెగలేదు.. ఒకరిపై ఒకరూ దూషించుకుంటూ హౌజ్ అంతా రచ్చ రచ్చ చేశారు. సిరి చాలా వరకు సన్నీతో కోపంగా మాట్లాడింది. నువ్వు ఏమన్నా హీరో అనుకుంటున్నావా అంటూ రెచ్చిపోయింది. ఇక షణ్ముఖ్ విన్నర్ కాడనే కారణంగానే సన్నీతో ఆమె ఎక్కువగా వాదన చేసుకుంటుందనేది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కావాలనే సన్నీని రెచ్చగొడుతుందనేది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…