మోస్ట్ అవెయిడ్ మూవీ పుష్ఫ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అందరిలోను అంచనాలు పెరిగిపోయాయి. ప్యాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలుగుతో పాటు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో అనువాదవైంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సూపర్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ మూవీ ప్రమోషన్ మొత్తాన్ని స్వయంగా బన్నీనే మోశాడు. ఇప్పటికే హైదరాబాద్ తోపాటు తమిళనాడు, కర్ణాటకల్లో భారీ ఎత్తున ప్రమోషన్ చేశాడు. బన్నీతో పాటు రష్మికా కూడా ప్రమోషన్లలో భాగమైంది.
తాజాగా గురువారం కూడా ముంబైలో ప్రమోషన్ కోసం చిత్రయూనిట్ వెళ్లింది. తొలిసారిగా అల్లు అర్జున్ హిందీలో పుష్పగా వస్తుండటంతో నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇది తన జీవితంలో ముఖ్యమైన రోజని.. ఇకపై నాసినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో ఉండేలా చూసుకుంటానని.. స్వదేశంతో పాటు విదేశీ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా సినిమాలు చేస్తానని అన్నారు. అయతే హిందీ మీడియా మీ యాక్టింగ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ మేనరిజం కనిపిస్తుందని అడగ్గా బన్నీ నేను చెన్నైలో పుట్టిపెరిగానని.. సహజంగానే దక్షిణాది స్టార్ల నుంచి ప్రేరణ పొందానని చెప్పుకొచ్చాడు.
తనకు అమితాబ్ బచ్చన్ అంటే విపరీతమైన అభిమానం అని అన్నాడు. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన తీసుకువచ్చాడు. తన మావయ్య చిరంజీవి మంచి డ్యాన్సర్ అని… ఇది అందరికి తెలిసిన విషయమే అని అన్నారు. నేను వారిని ఇమిటేట్ చేయలేదని.. సందర్భానుసారంగా అలావస్తాయని అన్నారు అల్లు అర్జున్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…