Don Seenu: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమాలలో డాన్ శీను సినిమా ఒకటి. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్నటువంటి రవితేజ అనంతరం గోపీచంద్ డైరెక్షన్లో మరో రెండు సినిమాలు చేశారు. ఈ సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో వీరిద్దరి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ గా పేరు సంపాదించుకుంది.
ఇకపోతే డాన్ శీను సినిమాలో ముందుగా నటించే అవకాశం రవితేజకు రాలేదని ఈ సినిమాకు ఈయన పస్ట్ ఛాయిస్ కాదని తాజాగా గోపీచంద్ ఓ సందర్భంలో వెల్లడించారు. ముందుగా ఈ సినిమా కోసం ప్రభాస్ నుసంప్రదించగా అప్పటికే ఆయన డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు అలాగే ఆయన నటించిన బుజ్జిగాడు సినిమా కూడా ఇదే కోవకు చెందినది కావడంతో ఈ సినిమాను ప్రభాస్ రిజెక్ట్ చేసిన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ప్రభాస్ ఈ సినిమాకి నో చెప్పడంతో డైరెక్టర్ గోపిచంద్ మలినేని హీరో గోపీచంద్ వద్దకు వెళ్లారు. ఇక ఈయన కూడా అప్పుడు వాంటెడ్,గోలీమార్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే డేట్స్ అడ్జస్ట్ కానీపక్షంలో గోపీచంద్ ఈ సినిమాని వదులుకున్నారని తెలుస్తోంది.ఇలా ఈ సినిమాకు ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేయడంతో మరింత ఆలస్యం చేస్తే బాగుండదని భావించిన గోపీచంద్ ఈ సినిమా కథను రవితేజకు వినిపించారని తెలియజేశారు.
ఈ సినిమా కథ విన్నటువంటి రవితేజ వెంటనే సినిమాకు ఓకే చెప్పడంతో కేవలం 77 రోజులలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చామని ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని తెలియజేశారు. ఇలా రవితేజతో తన జర్నీ డాన్ శీను తో ప్రారంభమైందని తర్వాత బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలను కూడా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…