Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా NBK 108 వర్కింగ్ టైటిల్ తో శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ అలాగే మరొక హీరోయిన్ శ్రీ లీల కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాలకృష్ణకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఈ పోస్టర్ కి అనుహ్యమైన స్పందన లభించింది.ఇకపోతే తాతగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో బాలయ్య ఎలా కనిపించబోతున్నాడు ఏ పాత్రలో నటించబోతున్నారనే కుతూహలం అందరిలోనూ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలకృష్ణ కాళీమాత భక్తుడిగా కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో కాళీమాత దేవాలయంలో వచ్చే ఓ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుందట. ఈ సినిమాలో బాల్యయ తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ చెప్పబోతున్నారనీ సమాచారం.
ఈ సినిమాలో బాలకృష్ణ చేయబోయే ఈ పాత్ర ఇదివరకు ఎప్పుడు ఆయన చేయలేదని ఈ పాత్రలో బాలయ్య సరికొత్తగా ప్రేక్షకులను సందడి చేయడానికి రాబోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎప్పుడు తన కామెడీ సినిమాలతో అందరిని నవ్విస్తున్నటువంటి అనిల్ రావిపూడి ఈసారి మాత్రం బాలయ్యతో విభిన్నంగా భారీ యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…