Doppelganger’s : మనం చిన్నపటి నుండి పెద్ధవాళ్లు చెప్పినపుడు వింటూనే ఉన్నాం మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని. అది నిజమా అని ఎపుడైనా ఆలోచించారా? చాలా సార్లు వార్తల్లో మన హీరోలాగానో లేక హీరోయిన్ లాగానో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ మనలాంటి పోలికలతో ఉన్న వాళ్ళు కూడా ఈ భూమి మీద ఎక్కడో ఒకచోట ఉంటారని తెలుసా. ఇక ఎలా ఎంతోమంది వారి లాగే ఉన్న ట్విన్స్ ను కనుక్కోడానికి ఒక వెబ్ సైట్ కూడా ఉంది. దాదాపు గా పోలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏమాత్రం రక్త సంబంధీకులు కానివారు ఈ ప్రపంచంలో ఏడు మంది కాకపోయినా కనీసం మనలాంటివారు ఒకరు ఉండే ఛాన్స్ అయితే పక్కా అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరి మనలా ఉన్న వ్యక్తుల్ని ఎలా కనుక్కోవడం…
కెనడాకి చెందిన ఫ్రాన్సిస్ బ్రినెల్లే అనే అరవై నాలుగు ఏళ్ళ సైన్టిస్ట్ దాదాపుగా 12 ఏళ్ళు ఈ డోపులర్ గ్యాంగర్స్ గురించి పరిశోధనలు జరిపారు. ఐ యాం నాట్ లుక్ అలైక్ అనే ప్రొజెక్ట్ లో భాగంగా ఈయన దాదాపు 12 ఏళ్ళు ఒకేలా ఉన్న ఇద్దరు వ్యక్తులను కనుగొనడానికి శ్రమించారు. అసలు ఒకేలా ఉన్న వారిని కనుగొనడానికి అసలు కారణం ఫ్రాన్సిస్ ను నువ్వు అచ్చం మిస్టర్ బీన్ లా ఉంటావని చాలా మంది చెప్పడం. ఇక ఆయన మొలదట్లో ఆయనకు తెలిసిన కొంతమంది ఒకేలా ఉన్న వాళ్ళ ఫోటోలను వెబ్ సైట్ లో ఉంచి అలా మీడియా, సాధారణ జనం దృష్టిలో పడ్డారు. ఇక చాలా మంది ఆసక్తి ఉన్నవారు అలా వారి ట్విన్స్ ను కనుక్కొన్నారు. ఈ ప్రొజెక్ట్ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే దాదాపు 200 మందికి పైగా ట్విన్స్ ను ఆయన కనుగొన్నారు మరియు వారిలో ఎవరికీ ఒకరితో ఒకరికి అస్సలు సంబంధం లేదు. ఇక ఈ ప్రొజెక్ట్ ఇప్పటికీ రన్ అవుతోంది.
ఇక ఇలాంటి పరిశోధనలే మరో అమ్మాయి కూడా చేసింది. ఆమె నియోన్ గిని, ఈమె మొదలు పెట్టిన ప్రొజెక్ట్ పేరు ట్విన్స్ స్ట్రాంజెర్స్. ఈమె ఈ ప్రొజెక్ట్ లో భాగంగా మొదట ఆమె లాంటి వ్యక్తినే కనుగొనాలనే 28 ఛాలెంజ్ తీసుకుంది. అనుకున్నట్లే ఆమె లాంటి వ్యక్తిని కనుగొనింది. అయితే ఆమెలా ఉన్న ఒక్కరిని కాదు ఏకంగా ముగ్గురిని కనుక్కోవడం విశేషం. ఇలా ఫ్రాన్సిస్, నియోన్ గిని ఇద్దరూ వారి పరిశోధనలతో ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచారు. అయితే ఇలా మనం ట్విన్స్ కలవడం మన పూర్వికుల నమ్మకం ప్రకారం అశుభం. చాలా చరిత్రల విశ్వాసల్లో మనలాంటి వ్యక్తిని కలిస్తే మనకు చెడు జరుగుతుందని ఇద్దరిలో ఒకరు చనిపోతారనే నమ్మకాలూ ఉన్నాయ్. ఈ కాలంలో అవన్నీ ఎవరూ పట్టించుకోరు. ఇక మీలాగే ఉన్న ట్విన్ ను కనుక్కోవాలంటే మాత్రం ట్విన్ స్ట్రాంజెర్ వెబ్ సైట్ లో మన ఫోటో అప్లోడ్ చేస్తే కొద్దికాలానికి మనలాగానే ఉన్నా ట్విన్ ను వెతికిపెడతారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…