Featured

G V Narayana Rao : చిరంజీవి మీద కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తుంటారు… ఆ నిర్మాతలకు పిలిచి సినిమా ఇచ్చారు : జీవీ నారాయణ రావు

GV Narayana Rao : అంతులేని కథ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు జీవీ నారాయణ రావు గారు ఆ సినిమా తరువాత హీరోగానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ప్రొడ్యూసర్ గా మారి చిరంజీవి గారితో దేవాంతకుడు, అలాగే ఫ్రెండ్స్ తో కలిసి యముడికి మొగుడు సినిమాలను తీసి మంచి హిట్స్ అందుకున్నారు. ఇక చిరంజీవి గారితో, స్నేహితులతో కలిసి సినిమా నిర్మిస్తున్న సమయంలో వచ్చిన విబేధాలు వంటి విషయాల మీద అయన మాట్లాడారు. ఇక చిరంజీవి గారు ఎంతో మందికి సహాయం చేసినా తనపై ఆరోపణలు చేస్తుంటారు అంటూ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.

ఎంతోమంది నిర్మాతలకు అవకాశం ఇచ్చారు…

చిరంజీవి గారు మొదటి నుండి కష్టపడి పైకి వచ్చారు. అలానే తన వల్ల నష్టపోయిన నిర్మాతకు మరోసారి అవకాశం ఇచ్చి ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అంటూ జీవీ నారాయణ రావు గారు తెలిపారు. జీవి నారాయణ రావు గారు చిరంజీవి గారికి తొలి నుండి మంచి మిత్రులు, ఆయన ఎదగడం చూసిన వ్యక్తుల్లో ఒకరు. దేవివరప్రసాద్ లాంటి నిర్మాతకు మళ్ళీ పిలిచి అవకాశం ఇచ్చారు. మృగరాజు సినిమా చేసారు.

కానీ ఆ సినిమా పోయింది దానికి చిరంజీవి బాధ్యుడు కాదు కదా అంటూ చెప్పారు. ఇక క్రాంతి కుమార్ గారికి మరోసారి డేట్లిచ్చారు. అలా ‘ముఠామేస్త్రి’ సినిమా ఆయన నిర్మాణంలో తీసారు. చిరంజీవి గారు ఆయన ఎదుగుతూనే ఎందరికో సహాయం చేసారు. అలా చేసారు కాబట్టే ఆయన అంత ఎదిగారు. మనం ఎంత పరులకు చేస్తామో అది మళ్ళీ మనకు తిరిగివస్తుందంటారు. చిరంజీవి, రజనీకాంత్ లను చూస్తే నిజమనిపిస్తుంది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago