Sree Lakshmi : బాబు చిట్టీ అంటేనే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీ లక్ష్మి. ఎన్నో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. తెలుగు ప్రొడ్యూసర్ అమర్నాథ్ కూతురిగా ఇండస్ట్రీ కి పరిచయమైన శ్రీ లక్ష్మి తండ్రి కి అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు మొదలవడంతో సినిమాల్లో చిన్న పాత్రలతో మొదలుపెట్టింది. శ్రీ లక్ష్మి సోదరుడు రాజేష్ కూడా హీరోగా, సినిమాల్లో నటించారు. ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం హీరోయిన్ గా తమిళ తెలుగు లో నటిస్తోంది.
కడుపే కదా మళ్ళీ వస్తుందిలే అనుకున్నా…
ఆర్థిక ఇబ్బందులతో సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీలక్ష్మి చాలా సినిమాల్లో కామిక్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జంధ్యాల, కే విశ్వనాధ్ గారి సినిమాల్లో మంచి పాత్రలతో నంది అవార్డులు తెచ్చుకున్న శ్రీ లక్ష్మి కుటుంబ బాధ్యతలతో తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నారు. పిల్లలు పుడితే సినిమా కెరీర్ లో ఇబ్బందులు వస్తాయని ఇంకా ఇంట్లో తీర్చాల్సిన అప్పులు, బాధ్యతలు ఉన్నాయని వద్దనుకుంది. ఆ తరువాత మళ్ళీ పిల్లలు కావాలనుకున్నపుడు పుట్టలేదు వయసు పెరగడం, థైరాయిడ్ సమస్యలతో పిల్లలు లేకుండా పోయారు.
దేవుడు ఏదో ఒక కొరత మనిషికి పెడతాడు అలా నాకంటూ సొంత కుటుంబం లేకుండా చేసాడు. ఎప్పుడూ కుటుంబ భాద్యతలు ముఖ్యం, పిల్లలే కదా మళ్ళీ పుడతారులే అనుకున్నా, ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ చెప్పారు. పలు సీరియల్స్ లో కూడా నటించిన శ్రీ లక్ష్మి అప్పుడప్పుడు ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…