Categories: FeaturedMovie News

ముఖ్యమంత్రి కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్న డాక్టర్ గురవారెడ్డి..ఈయన కూతురు మన టాలీవుడ్ స్టార్ అని మీకు తెలుసా..!

మీలో లిటిల్ సోల్జర్స్ సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పాపాయి అంటే ఇష్టం లేని వారెవరైనా ఉన్నారా..అస్సలు ఉండరు ..అప్పట్లో ఒక సంచలనం సృష్టించిన ఈ బుల్లి తార గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్న అనుకుంటున్నారా..మొన్నీ మద్యే పెళ్లి చేసుకున్న ఈ బుల్లి స్టార్ తల్లిదండ్రులు మనకు బాగా తెలిసిన వారే..వారు మరెవరో కాదు సన్ షైన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గురవారెడ్డి.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈయన చాల ఫేమస్ అయ్యారు. ఇక ఈయన ప్రేమించి పెళ్లాడింది ఒక ముఖ్యమంత్రి కూతురిని ..మరి అస్సలు ప్రేమ ఎలా పుట్టింది పెళ్లి ఎలా జరిగింది ముఖ్యమంత్రి కూతురిని ఎలా పటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ గురవారెడ్డి గుంటూరు జిల్లాలో జన్మించారు. ఉత్తమ ఆర్థోపెడిక్ గా ( మోకాళ్ళ ఎముకలు మార్చగల, జాయింట్ చేయగల డాక్టర్ గా ప్రఖ్యాతి చెందారు) దక్షిణాది భారతదేశంలో చాలా కాలం పాటు ఎంతో మందికి సేవలు చేసిన గురవా రెడ్డి చాలా సాదాసీదాగా ఉంటారు. నేనే గొప్ప డాక్టర్ అని తాను ఏ దర్పం అసలు చూపించరు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన గురవా రెడ్డి హైదరాబాద్ నగరంలో సన్ షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి ఎంతో మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. గురవారెడ్డి గారు ఒక్కరే సంవత్సరానికి నాలుగువేల మోకాలు ఆపరేషన్లు చేస్తారు. ఇంగ్లాండులోని యూనివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ నుండి ఎంసిహెచ్ లో పట్టభద్రులయ్యారు. ఎఫ్ఆర్సిఎస్ (లండన్) ఎఫ్ఆర్సిఎస్ గ్లాస్గో ఎఫ్ఆర్సిఎస్(ఎడిన్బర్గ్) ఇలా 3 ఎఫ్ ఆర్ సి ఎస్(FRCS) చదువులను మూడు ప్రముఖ దేశాల్లో పూర్తి చేశారు. పూణే సంచేటి ఇన్స్టిట్యూట్ లో ఎముకలకు సంబంధించిన వైద్యవిద్యను అభ్యసించారు.

అయితే గురువా రెడ్డి కొడుకు, కూతురు అలాగే అల్లుడు కూడా వైద్య వృత్తిలో పెద్ద డాక్టర్లుగా కొనసాగుతున్నారు. అతని భార్య కూడా గైనకాలజిస్ట్ గా ఆడవారికి చికిత్సనందిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి కుమార్తె అయిన భవాని రెడ్డి ని డాక్టర్ గురవారెడ్డి గారు వివాహం చేసుకున్నారు. నటుడు ఎన్టీరామారావు కంటే ముందుగా భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వ్యవహరించారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో భవాని రెడ్డి ఎంబిబిఎస్ చదువుకోగా అతను మాత్రం గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అయితే గురవారెడ్డి కి భవాని రెడ్డి గారు నాలుగేళ్ళు జూనియర్. అయితే వీళ్ళిద్దరూ బంధువులే కావడంతో ఒకరినొకరు ఇష్టపడి తదనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago