తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన పాటలతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న సునీత తాజాగా రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పెళ్ళి విషయంలో సునీత మొదట్లో విమర్శల పాలయ్యారు. పెళ్లి తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సునీత సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉండేవారు.
ప్రస్తుతం సునీత జీ తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి డ్రామా జూనియర్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు చేసే ఫర్ఫార్మెన్స్ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈవారం ప్రసారం కాబోయే డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రోమోలో భాగంగా నేటి సమాజంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య స్నేహ బంధాన్ని కూడా వక్రబుద్ధితో చూసే ఈ లోకం తీరు ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా కళ్ళకి కట్టినట్టు చూపించారు.ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో స్నేహంగా ఉన్నా వారి మధ్య లేనిపోని బంధం కలిపి వారిని ఎలా అవమానిస్తున్నారో అద్భుతంగా చేసి చూపించారు. ఈ పర్ఫామెన్స్ చూసిన తరువాత సింగర్ సునీత కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఈ స్కిట్ తర్వాత సునీత మాట్లాడుతూ.. రోడ్డుపైన ఆంటీలు, ఆఫీస్ లో బాస్ లు ఇవన్నీ కలిపి నా జీవితంలో ఒకే ఒక క్యారెక్టర్ అంటూ సునీత కొంత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…