డ్రగ్ మాఫియా సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలోనూ డ్రగ్ మాఫియా సృష్టిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలను NCB అధికారులు విచారణ చేపట్టగా… తాజాగా ముంబై డ్రగ్స్ కేసులో భాగంగా నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ కేసులో భాగంగా ఉదయం నుంచి అధికారులు విచారణ కొనసాగించగా కీలకమైన ఆధారాలు లభించడంతో ఆర్యన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇలా షారుక్ తనయుడు అరెస్టు కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తనయుడు అరెస్ట్ అయిన తర్వాత షారుఖ్ ని కలవడానికి సల్మాన్ ఖాన్ షారుఖ్ ఇంటికి చేరుకున్నారు. సల్మాన్ రాత్రి 11 గంటల సమయంలో షారుక్ ఇంటికి వెళ్తున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శనివారం క్రూజర్ పై దాడి చేసిన అధికారులకు ఇందులో ఆర్యన్ ఉండటం చేత అతనిని అరెస్టు చేసిన అధికారులు సుమారు 12 గంటల సమయం పాటు తనని విచారించారు. ఈ క్రమంలోనే అతనిని కోర్టులో హాజరుపరచగా అతడికి ఒక రోజు కస్టడీ విధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్యన్ తో పాటు మరో ఎనిమిది మందిని అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం షారుక్ తరఫు లాయరు సతీష్ మన్షిండే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది.కొడుకు అరెస్ట్ కావడంచేత తనని పరామర్శించడం కోసమే సల్మాన్ ఖాన్ తన నివాసానికి చేరుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…