టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా సంచలనమైన వార్త ఉందంటే ప్రస్తుతం సమంత నాగచైతన్య విడాకులు విషయం అని చెప్పవచ్చు. సమంత నాగచైతన్యలు విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా వెల్లడించిన తర్వాత వీరి విడాకుల విషయమై పలువురు సెలబ్రెటీలు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు, ట్వీట్స్ చేశారు.
ఈ క్రమంలోనే సమంత స్నేహితురాలు సింగర్ చిన్మయి సమంత విడాకుల తరువాత చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.చైతన్య సమంత విడిపోతున్నామని చెప్పడానికి కొన్ని గంటల ముందు ఇంస్టాగ్రామ్ వేదికగా చిన్మయి చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే ఈమె స్పందిస్తూ… పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు.. మీ ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, లాభనష్టాలు, మతాలు, పిల్లలు వంటి విషయాల గురించి ముందుగా వారితో చర్చించి పెళ్లి చేసుకోవాలి.ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి కేవలం వారి మధ్య ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదని ఈ సందర్భంగా ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇకపోతే విడాకుల అనంతరం సమంత మరోసారి సోషల్ మీడియా ఖాతాలలో తన పేరును మార్చుకున్న సంగతి మనకు తెలిసిందే. విడాకులకు ముందు అక్కినేని తొలగించి సింగిల్ లెటర్ ఎస్ అని పెట్టుకున్న సమంత విడాకులు తీసుకున్న తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో సమంత అని పేరు మార్చుకున్నారు. అయితే ఫేస్ బుక్ ఖాతాలో మాత్రం ఇప్పటి వరకు సమంత అక్కినేని అని ఉండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…