సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొంత సమయం లోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో సాయిపల్లవి ఒకరు. ఎంతో విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్న సాయిపల్లవి గ్లామరస్ పాత్రలలో నటించకుండా అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి అభిమానులకు ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. సాయి పల్లవి వ్యక్తిగత విషయానికి వస్తే…టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైంది. ప్రస్తుతం సాయి పల్లవి శిక్షణ పొందిన ఒక డాక్టర్ అని చెప్పవచ్చు.
ఇలా డాక్టరేట్ పొందిన సాయి పల్లవి తన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడానికి డాక్టర్ వృత్తిని చేపట్టాలని భావించినట్లు ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ క్రమంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనుందా అంటే.. తనకు ఏ విధమైనటువంటి ఛాలెంజింగ్ రోల్స్ వచ్చిన తప్పకుండా సినిమాలలో నటిస్తానని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు.
ప్రస్తుతం సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటిస్తున్నటువంటి ‘శ్యామ్ సింగ రాయ్’లో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఎంసీఏ విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…