సోషల్ మీడియాలో సమంత నాగ చైతన్య దంపతుల గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే శనివారం సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య స్పందిస్తూ తాము వివాహ బంధం నుంచి విడిపోతున్నాం అని చెబుతూ… వారి విడాకుల గురించి అధికారిక ప్రకటన చేయడంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు షాక్ కి గురయ్యారు.ఈ విషయం వెల్లడించిన తర్వాత చైతన్య మరోసారి సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి పోస్టులు చేయలేదు.
తాజాగా నేడు నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని ట్వీట్ చేశారు. అయితే తన సంతోషానికి కారణం ఏంటనే విషయానికి వస్తే… సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఇప్పటికి అపోలో హాస్పిటల్ లో ఉంటూనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడుతున్నారు.
తాజాగా నిన్న సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తాను ఆరోగ్యంగా ఉన్నానని, కోలుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో పలువురు సెలబ్రిటీలు ఈ ట్వీట్ పై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య సాయి తేజ్ ట్వీట్ పై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రేమతో అని నాగచైతన్య ట్వీట్ చేశారు.
సమంతతో విడాకులు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా వేదికగా స్పందించని నాగచైతన్య మొట్టమొదటిసారిగా సాయి తేజ ఆరోగ్యం గురించి స్పందించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే సాయి తేజ్ ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు తన ఆరోగ్యానికి ఏ ప్రమాదం లేదని తెగ సంబర పడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…