ఒకప్పుడు మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ అంటే కేవలం ద్రాక్ష, బాదంపప్పు, జీడిపప్పు వంటివి మాత్రమే లభించేవి. కానీ ప్రస్తుతం మార్కెట్లో కివి, అంజూర, ఉసిరి మొదలైన పండ్లను కూడా ఎండబెట్టి మార్కెట్లో మనకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.తాజా పండ్లలో ఉన్నటువంటి పోషక విలువలు అన్ని కూడా ఈ ఎండిన పండ్లలో ఉండటం వల్ల చాలామంది ఈ డ్రైఫ్రూట్స్ కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ డ్రైఫ్రూట్స్ ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకోవడానికి వీలు ఉంటుంది కనుక మార్కెట్లో వీటికి అధిక డిమాండ్ ఏర్పడింది.
సాధారణంగా ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది.కేవలం ఆరోగ్య పరంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఉసిరి లో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఉసిరిలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు మనకు ఎన్నో రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి దోహదం చేస్తాయి. ఇన్ని పోషక విలువలు కలిగినటువంటి ఉసిరిని ప్రతిరోజు రెండు ముక్కలు తినడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఉసిరిలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్ సి తో పాటు ఇతర విటమిన్స్ మినరల్స్ ఫైబర్, మాంగనీస్, ఐరన్ పొటాషియం వంటి పోషకాలు అధిక మొత్తంలో ఉండటం వల్ల ఉసిరి మనకు వివిధ అనారోగ్య సమస్యల నుంచి విముక్తిని కల్పిస్తుంది. ముఖ్యంగా మన శరీరంలో అనేక రకాల వ్యాధులతో పోరాడటానికి అవసరం అయ్యే రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కీలకపాత్ర పోషిస్తుంది.
ఉసిరిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్దక సమస్య నుంచి విముక్తి కల్పించడమే కాకుండా జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే నోటి పూత నోటి ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు ఉసిరి పొడిని నీటిలో కలుపుకుని బాగా పుక్కిలించడం వల్ల నోటి ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్యలో ఆర్థరైటిస్ సమస్య ఒకటి.ఈ సమస్యతో బాధపడే వారు ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత రెండు ఎండిన ఉసిరి ముక్కలను తినడం వల్ల ఈ విధమైన సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా జుట్టు సంరక్షణ, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…