Featured

Duniya Vijay : చిన్న ఆర్టిస్ట్ గా మొదలై సూపర్ స్టార్ గా ఎదిగిన దునియా విజయ్…!

Duniya Vijay : కన్నడ చిత్ర సీమలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన బి ఆర్ విజయ్ తన కష్టంతో ఎదిగిన సూపర్ స్టార్. కర్ణాటకలోని కుంభర్నహల్లి అనే గ్రామంలో జన్మించిన విజయ్ బెంగళూరులో చదువుకున్నాడు. చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తి ఎక్కువగా ఉన్న విజయ్ తండ్రి జోబులోని డబ్బులను కొట్టేసి సినిమాలను చూసేవాడు. ఒక్కోసారి తండ్రికి దొరికి పోయి దెబ్బలను కూడా తినేవాడట, అందుకే తండ్రి అంటే విజయ్ కి చాలా భయమట. ఇక విజయ్ చిన్న క్యారెక్టర్ తో సినిమాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టి ‘దునియా’ సినిమాలో హీరోగా చేసి ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు.

రెండు పెళ్లిళ్లు.. ముగ్గురు పిల్లలు…

దునియా విజయ్ గా కన్నడ ప్రజల ప్రేమ అందుకున్న విజయ్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి ‘రంగ ఎస్ఎల్సి’ అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసాడు. అందులో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ జోగి, రిషి, డియడ్లీ సోమా వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపైన తన ఫ్రెండ్స్ తీసిన ‘దునియా’ సినిమాలో అనూహ్యంగా హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుని ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న విజయ్ మొదట నాగరత్న ను పెళ్లి చేసుకొని 14 ఏళ్ల తరువాత విడాకులు తీసుకుని మళ్ళీ కీర్తి పట్టడి అనే మరో మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యకు ఇద్దరు అమ్మాయిలు కాగా రెండో భార్యతో ఒక మగపిల్లాడు విజయ్ కి ఉన్నారు. ప్రస్తుతం కన్నడలో హీరోగా మంచి సినిమాలను చేస్తున్న విజయ్ ఇటు తెలుగులో ‘వీర సింహ రెడ్డి’ లో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. దీంతో తెలుగులోను మంచి అవకాశాలను అందుకుంటున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago