Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత పూర్తిగా తన సినిమా షూటింగులకు కూడా దూరమయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఈమె తిరిగి తన సినిమా షూటింగులలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే సమంత ఆరోగ్యం కాస్త కోలుకోవడంతో ఈమె పలు ఆలయాలను దర్శిస్తూ తన ఆరోగ్యం గురించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సమంత తమిళనాడులోని పళనిశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈమె కొండకింది భాగం నుంచి పై వరకు మెట్ల మార్గం గుండా వెళ్తూ పూజలు చేశారు.
ఇలా ప్రతి మెట్టు ఎక్కుతూ ప్రతి మెట్టుపై కర్పూర హారతులు వెలిగిస్తూ సమంత ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా సమంత ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె త్వరలోనే తాను కమిట్ అయినా సినిమా షూటింగులలో పాల్గొనబోతున్నారు. సమంత ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటించగా, తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నారు.
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్‌లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…