General News

PM Kissan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20వ విడత డబ్బులు రావాలంటే e-KYC తప్పనిసరి! ఇలా చేయాలి

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం కింద లబ్ధిదారులకు శుభవార్త. అతి త్వరలో 20వ విడతగా రూ.2,000 లు విడుదల కానున్నాయి. గతంలో ఫిబ్రవరిలో 19వ విడత విడుదల కాగా, ఇప్పుడు జూన్ చివరి నాటికి 20వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ మొత్తాన్ని పొందాలంటే e-KYC పూర్తిచేయడం తప్పనిసరి. ప్రభుత్వం ప్రకారం, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు పడతాయి. ఇందుకోసం రైతులు ముందుగానే e-KYC పూర్తి చేసుకోవాలి.

e-KYC is mandatory to get the 20th installment of money!

PM-Kisan Scheme గురించి

  • కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు ఏటా ₹6,000 ఆర్థిక సాయం అందుతుంది.
  • ఈ మొత్తాన్ని తొమ్మిది నెలల వ్యవధిలో మూడు విడతలుగా ₹2,000 చొప్పున చెల్లించబడుతుంది.
  • ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఇది మరింత ఉపయోగకరంగా మారింది.

e-KYC పూర్తిచేయాల్సిన అవసరం ఎందుకు?

  • అసలైన లబ్ధిదారులను గుర్తించడం
  • డబ్బులు సరైన ఖాతాల్లో పడేలా చేయడం
  • మోసాలు నివారించడం
    ఈ కారణాలతోనే ఆధార్ ఆధారిత e-KYC ప్రభుత్వానికి అత్యవసరంగా మారింది.

e-KYC చేసుకునే మార్గాలు

  1. OTP ఆధారిత e-KYC (వెబ్‌సైట్ / యాప్‌ ద్వారా)
  2. బయోమెట్రిక్ ఆధారిత e-KYC (CSC లేదా SSK సెంటర్ల ద్వారా)
  3. ఫేస్ అథెంటికేషన్ ఆధారిత e-KYC (మొబైల్ యాప్‌ ద్వారా – ఫింగర్‌ప్రింట్‌ లేని వారికి)

OTP ఆధారిత e-KYC ఎలా చేయాలి?

  1. అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in కి వెళ్ళండి
  2. టాప్ రైట్‌లో ఉన్న ‘e-KYC’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి
  3. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి
  4. ఆధార్‌కు లింకైన మొబైల్‌ నంబర్‌కు వచ్చిన OTP ఎంటర్ చేయండి
  5. వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత e-KYC పూర్తవుతుంది

ఫేస్ అథెంటికేషన్ e-KYC ఎలా చేయాలి?

  1. Google Play Store నుండి:
    • PM-Kisan Mobile App మరియు
    • Aadhaar Face RD App ను డౌన్‌లోడ్ చేసుకోండి
  2. PM-Kisan యాప్‌ ఓపెన్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి
  3. లబ్ధిదారుల స్టేటస్ సెక్షన్‌కి వెళ్లి, e-KYC స్టేటస్ ‘No’ అయితే, ‘e-KYC’ క్లిక్ చేయండి
  4. ఆధార్ నంబర్‌తో ముఖం స్కాన్ చేయండి
  5. స్కాన్ తర్వాత e-KYC పూర్తయింది అని చూపిస్తుంది

సాధారణంగా 24 గంటల్లోపే స్టేటస్‌ పోర్టల్‌లో అప్‌డేట్ అవుతుంది.

Alert to Farmers:

e-KYC చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉండదు. కావున వెంటనే e-KYC ప్రాసెస్‌ను పూర్తి చేయండి. అక్టే, 20వ విడత విడుదలయ్యే సమయానికి మీరు లబ్ధిదారుగా కొనసాగుతారు.

ఇతరులు మిస్ కాకుండా చూడాలంటే ఈ సమాచారాన్ని రైతులందరితో షేర్ చేయండి.
PM-Kisan – మీ ఖాతాలోకి నేరుగా ₹2,000 పొందండి… కానీ ముందుగా e-KYC చేయడం మర్చిపోవద్దు!

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago