ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టమైన ఫుడ్ ఫాస్ట్ ఫుడ్. ఇప్పుడు ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫాస్ట్ ఫుడ్ కి ఎక్కువగా అలవాటు పడ్డారు.కొందరు అయితే రోజుకు ఒక్కసారైనా బయట ఫుడ్ తినకుండా ఉండలేక పోతున్నారు అంటే ఆ ఫాస్ట్ ఫుడ్ కి ఎంత అలవాటు పడ్డారో మీరే అర్థం చేసుకోవచ్చు.అలా ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ కు ఎడిక్ట్ అయ్యారు.
అయితే ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని తెలిసి కూడా చాలా మంది వాటిని తినడం ఆపలేకపోతున్నారు. తరచూ ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, చిప్స్ వంటివి ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిజ్జాలు, చిప్స్ తినడం వల్ల రక్తపోటు, షుగర్, బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.
బ్రెయిన్, బిహేవియర్, ఇమ్యూనిటీ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను ప్రచురించడం జరిగింది. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, నిల్వ పదార్థాలు, ఫ్లేవర్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మెమొరీ లాస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యకరమైన పదార్థాలతో పిజ్జాలు, ఇతర జంక్ ఫుడ్స్ ను తయారు చేయడం జరుగుతుంది. ప్రాసెస్ చేయబడిన మాంసం, శుద్ధి చేసిన పిండి తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
ఇక ఈ విషయాలన్నింటినీ కూడా శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపి వెల్లడించారు. ఈ తరహా ఆహారం తిన్న ఎలుకలలో మెదడు పనితీరు మందగించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీ సీనియర్ పరిశోధకులు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తిన్నవాళ్లు ఉన్నట్లుండి అన్నీ మరిచిపోతున్నారని వెల్లడించారు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఇష్టపడేవాళ్లు ఆ ఆహారాన్ని మితంగా తీసుకుంటే మంచిది. ఇక ఇలాంటి ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు నిపుణులు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…