వేసవికాలం మొదలైతే చాలు మన ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు 24 గంటలు తిరుగుతూనే ఉంటాయి.ఈ విధంగా ఎక్కువ సమయంపాటు ఏసీలు ఆన్ చేసి ఉండటం వల్ల మనకు ఎంతో చల్లదనంగా ఉంటుందని భావిస్తాము.కానీ ఈ విధంగా ఏసీలను ఉపయోగించటం వల్ల కరెంటు బిల్లు అధికంగా రావడమే కాకుండా అనేక చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు తెలిపారు.
ఒక రోజులో 8 నుంచి 10 గంటల పాటు ఏసి వాడటం వల్ల ఏకంగా 10 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ విపత్కర పరిస్థితిని చక్కబెట్టడం కోసం రాష్ట్ర ఇంధన వనరుల పొదుపు సంస్థ అవగాహన కార్యక్రమాలను చేపట్టాయి.రాష్ట్రంలో ఏసీల వార్షిక విద్యుత్ డిమాండ్ 2,800 మిలియన్ యూనిట్లు. వీటిని 26 డిగ్రీల స్థాయిలో వాడుకుంటే ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా ఎంతో ప్రయోజనమని సీఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో మన ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండకూడదు అంటే గదిలో ఏసీ ఉష్ణోగ్రతలు 19 నుంచి 21 డిగ్రీల వద్ద ఉంటే.. అవి సాధారణ ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువ. దీని ద్వారా ఆర్థరైటిస్ నొప్పులు, చర్మ అలర్జీలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. 26 డిగ్రీల వద్ద ఒక ఏసి ఆన్ చేసినట్లయితే ఒక రాత్రికి కనీసం అయిదు యూనిట్ల కరెంటు వినియోగం తగ్గించినట్లు అవుతుంది. దీని ద్వారా పర్యావరణానికి ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఇంధన సంస్థ పేర్కొంది.
ఏసీల వినియోగంలో ఎప్పుడు 5 స్టార్ వినియోగం వల్ల రోజుకు 4.5 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. 1 స్టార్ స్లి్పట్ ఏసీ (1.5 టన్)తో ఏడాదికి రూ.665 ఆదా అయితే.. 5 స్టార్ ఏసీ తో సుమారు రూ. 2,500 పొదుపు చేయవచ్చు. ఒక పర్సెంట్ ఏసి ఉష్ణోగ్రతను తగ్గిస్తే 6 శాతం కరెంటు వినియోగాన్ని తగ్గించినట్లు అవుతుంది.
కేంద్ర విద్యుత్తుశాఖ సూచన మేరకు స్టార్ రేటెడ్ ఏసీలను కొనేలా, 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో నడిపేలా వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…