వేసవికాలం మొదలైతే చాలు మన ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు 24 గంటలు తిరుగుతూనే ఉంటాయి.ఈ విధంగా ఎక్కువ సమయంపాటు ఏసీలు ఆన్ చేసి ఉండటం వల్ల మనకు ఎంతో చల్లదనంగా ఉంటుందని భావిస్తాము.కానీ ఈ విధంగా ఏసీలను ఉపయోగించటం వల్ల కరెంటు బిల్లు అధికంగా రావడమే కాకుండా అనేక చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

ఒక రోజులో 8 నుంచి 10 గంటల పాటు ఏసి వాడటం వల్ల ఏకంగా 10 కిలోల కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతుంది. ఈ విపత్కర పరిస్థితిని చక్కబెట్టడం కోసం రాష్ట్ర ఇంధన వనరుల పొదుపు సంస్థ అవగాహన కార్యక్రమాలను చేపట్టాయి.రాష్ట్రంలో ఏసీల వార్షిక విద్యుత్‌ డిమాండ్‌ 2,800 మిలియన్‌ యూనిట్లు. వీటిని 26 డిగ్రీల స్థాయిలో వాడుకుంటే ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా ఎంతో ప్రయోజనమని సీఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో మన ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండకూడదు అంటే గదిలో ఏసీ ఉష్ణోగ్రతలు 19 నుంచి 21 డిగ్రీల వద్ద ఉంటే.. అవి సాధారణ ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువ. దీని ద్వారా ఆర్థరైటిస్ నొప్పులు, చర్మ అలర్జీలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. 26 డిగ్రీల వద్ద ఒక ఏసి ఆన్ చేసినట్లయితే ఒక రాత్రికి కనీసం అయిదు యూనిట్ల కరెంటు వినియోగం తగ్గించినట్లు అవుతుంది. దీని ద్వారా పర్యావరణానికి ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఇంధన సంస్థ పేర్కొంది.

ఏసీల వినియోగంలో ఎప్పుడు 5 స్టార్ వినియోగం వల్ల రోజుకు 4.5 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. 1 స్టార్‌ స్లి్పట్‌ ఏసీ (1.5 టన్‌)తో ఏడాదికి రూ.665 ఆదా అయితే.. 5 స్టార్‌ ఏసీ తో సుమారు రూ. 2,500 పొదుపు చేయవచ్చు. ఒక పర్సెంట్ ఏసి ఉష్ణోగ్రతను తగ్గిస్తే 6 శాతం కరెంటు వినియోగాన్ని తగ్గించినట్లు అవుతుంది.
కేంద్ర విద్యుత్తుశాఖ సూచన మేరకు స్టార్‌ రేటెడ్‌ ఏసీలను కొనేలా, 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో నడిపేలా వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here