Featured

Ester Noronha : బాలకృష్ణ తో సినిమా అవకాశం పోడానికి కారణం అదే…!

Ester Noronha : సినిమా ఇండస్ట్రీ కి వచ్చాక పెద్ద హీరోతో అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా కాదనదు. అది వారి కెరీర్ కి మంచి ఊపునిస్తుంది కాబట్టి అస్సలు చేజార్చుకోరు. కానీ భీమవరం బుల్లోడు సినిమా హీరోయిన్ ఎస్తేర్ మాత్రం ఏకంగా బాలయ్య బాబు సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుందట. మొదటి సినిమానే తేజ దర్శకత్వంలో చేసిన ఎస్తేర్, ఆ తరువాత ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే సురేష్ ప్రొడక్షన్స్ లో సినిమా అవకాశాన్ని అందుకుంది. అది కాకా అసలు ఈ అమ్మడు సినిమాల్లో నటించాలని హైదరాబాద్ రాలేదు వేరే పని మీద హైదరాబాద్ వస్తే అనుకోకుండా సినిమా అవకాశాలు రావడంతో ఇక్కడే ఉండి సినిమాలు చేసిందట.

చదువుకోవాలని సినిమా వద్దనుకున్న…

ఇక భీమవరం బుల్లోడు సినిమా షూటింగ్ సమయంలోనే బాలయ్య బాబుతో సినిమా అవకాశం, అలాగే ఇంకా చాలా ఆఫర్స్ వచ్చినా, చదువు మధ్యలో ఆపి సినిమాల్లో ఉండిపోవడం ఇష్టంలేక సినిమా ఆఫర్స్ ను వద్దనుకుందట. చదువు అయ్యాక మళ్ళీ సినిమాల్లోకి రావాలని అనుకుందట. గోవా పోర్చుగీసు కుటుంబానికి చెందిన ఎస్తేర్ ఉడిపి కర్ణాటక లో స్థిరపడ్డారు. కొంకణి భాషలోనూ సినిమాలు చేసిన ఎస్తేర్ కన్నడ భాషలోనూ, హిందీ భాషలోనూ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

ఇక మళ్ళీ చదువయ్యాక తెలుగులో నటిస్తోంది. ఈమధ్యనే ’69 సంస్కార్ కాలనీ’ సినిమా ద్వారా వచ్చింది. రొటీన్ కథలలో కాకుండా భిన్నంగా ఉన్న సినిమాల్లో నటించాలనుకుంటున్న ఈ భామ తెలుగు రాపర్ మరియు సింగర్ నోయల్ ను 2019 లో వివాహం చేసుకోగా అదే ఏడాది విడిపోయారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago