Geethakrishna : సంకీర్తన సినిమాతో మొదలై కోకిల, టైం, సర్వర్ సుందరం గారి అబ్బాయి వంటి విభిన్న సినిమాలతో వచ్చిన దర్శకుడు గీతాకృష్ణ ఎక్కువ సినిమాలు తీయలేదు. కేవలం తెలుగులో ఆరు సినిమాలు తీసిన ఆయన ఆ తరువాత మీడియా, జనానికి కనిపించకుండా పోయాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ హల్ చల్ చేస్తున్నాడు. సినిమా రంగలోని చాలా మంది సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ వైరల్ అవుతున్నాడు.
సమంత, తమన్నా ను పరిచయం చేసింది నేనే…
ఇక సినిమాలు తక్కువ చేసిన కమర్షియల్ యాడ్స్ ఎక్కువగా చేసిన గీతాకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సమంత, తమన్నా, గద్దే సింధూర లను పరిచయం చేసింది నేనే అని చెప్పారు. మోడలింగ్ చేసినపుడు యాడ్ అవకాశం ఇచ్చానని సమంత కేవలం పాకెట్ మనీ కోసం యాడ్స్ చేసిందని, కానీ అదృష్టం తనకు ఎక్కువ అందుకే టాప్ హీరోయిన్ అయిందని చెప్పారు.
ఈవివి నా టైటిల్స్ కాపీ కొట్టాడు…
ఇక ఈవివి సత్యనారాయణ తాను చాలా క్లోజ్ అని చెప్పారు. వల్ల ఫ్యామిలీ ఉన్నచోటే నేను ఉండేవాడినని అల్లరినరేష్, ఆర్యన్ రాజేష్ చిన్నపిల్లలుగా ఉన్నపుడు నా దగ్గరికి వచ్చేవారని యోగా చేస్తే నాతో పాటు చేసే వారని చెప్పాడు. ఇక చెవిలో పువ్వు, తొట్టిగ్యాంగ్ వంటి సినిమా టైటిల్స్ నావి అయితే ఈవివి వాటిని కాపీ కొట్టాడని చెప్పాడు. ఇక తాను డైరెక్టర్ చేసిన సినిమాలు కొరియన్, ఇతర విదేశీ సినిమాల కాపీలా అని అడుగగా నేను తీసిన కోకిల సినిమా పేపర్ న్యూస్ చూసి రాసుకున్నది, అదే సినిమాను చాలా ఏళ్ల తరువాత హాలీవుడ్ లో ఐ అని తీశారు, మరి వాళ్ళు నన్ను కాపీ కొట్టినట్లు కాదు కదా. సినిమాకు సంబంధించిన నాలెడ్జ్ లో నాతో ఎవరూ పోటీపడలేరు అంటూ ఛాలెంజ్ కూడా చేసారు గీతా కృష్ణ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…