Suriya : తమిళ హీరో సూర్య పేరుకే తమిళ హీరో అయినా తెలుగువాళ్ళు కూడా మనవాడే అనుకునే అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ‘గజినీ’ సినిమాతో ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయ్యాడు. ఇంతవరకు స్ట్రైట్ తెలుగు సినిమా చేయకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మాములుగా లేదు ఈ సింగం బాస్ కు. గజినీ సినిమా తరువాత యముడు సిరీస్ తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సూర్య, తన ప్రేమ గురించి జ్యోతికతో పరిచయం గురించి ముచ్చటించారు.
ఆ సినిమాతో పరిచయం, ఆ తరువాత ప్రేమ…
దర్శకుడు వసంత్ డైరెక్షన్లో ‘పోవేళ్ళం కేట్టుప్పర్’ అను సినిమాలో మొదటగా జ్యోతికతో పరిచయం ఏర్పడింది. మొదటగా ఇద్దరినీ వసంత్ గారు పరిచయం చేసారు. ఇక మొదటి సన్నివేశం ఇద్దరు చేయి పట్టుకుని లాంగ్ మార్చ్ చేయడం. ఆ సినిమాలో పరిచయం మాత్రమే ఆ తరువాత మరో రెండు సినిమాలు చేసాం అంటూ అప్పటి మధురస్మృతులను పంచుకున్నారు సూర్య. మూడో సినిమా ‘కాకా కాకా’ సినిమా హిట్ అయి మంచి గుర్తింపు ఇవ్వడమే కాకుండా నాకు జ్యోతికను ఇచ్చింది.
ఆ సినిమా తరువాత మేమిద్దరం సీరియస్ గా ప్రేమించుకోవడం మొదలు పెట్టాము అంటూ చెప్పారు. మొదట ఎవరు ప్రొపోజ్ చేసారని అడుగగా మొదట తానే ప్రొపోజ్ చేసినట్లు చెప్పారు. ఇక పెళ్లి విషయంలో మాత్రం సూర్య సోదరి బృంద తన తల్లిదండ్రులను ఒప్పించారట. ఇక సినిమాల గురించి ఇంట్లో అసలు చర్చించమని సూర్య చెప్పారు. దియా కు మంచి తండ్రిగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని చెప్పారు సూర్య. జ్యోతిక నా జీవితాన్నే మార్చేసిందంటూ పెళ్లి తరువాత చాలా మారానని అయితే జ్యో మాత్రం అలాగే ఉందని చెప్పారు. ఇక జ్యోతిక నాకేం కావాలో ముందే అలోచించి నన్ను సర్ ప్రైజ్ చేస్తుందంటూ తమ బంధంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…