Srikanth : విలన్ గా, సహాయక పాత్రలలో మొదట కనిపించిన శ్రీకాంత్, ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’ సినిమాతో 1991 లో తెలుగు సినిమాలలో తన కెరీర్ ని ప్రారంభించాడు. తరువాత చాలా చిత్రాలలో చిన్న పాత్రలతో విలన్ గా అలరించి ‘వన్ బై టు’ సినిమాతో మొదటిసారి హీరోగా కనిపించాడు. ‘తాజ్ మహల్’ సినిమా హీరోగా మంచి విజయాన్ని అందించింది. తన తోటి హీరోయిన్ అయిన ఊహని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఊహ శ్రీకాంత్ లకు రోషన్, రోహన్, మేధ అనే ముగ్గురు పిల్లలు కూడా. రోషన్ తెలుగు సినిమాలలో ఇప్పటికే హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లిసందడి చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఇక తాజాగా శ్రీకాంత్ కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం చేసుకున్నాడు.
మెట్ల మార్గం ద్వారా మొక్కులు చెల్లించి…
శ్రీకాంత్ ఊహలు కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సోమవారం ఉదయం మెట్ల మార్గంలో కుటుంబ సమేతంగా కొండెక్కి మరీ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు . ఇక శ్రీకాంత్ పెద్ద కుమారుడు హీరో రోషన్ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా అన్ని మెట్లకు పసుపు కుంకుమ పెట్టి పూజలు నిర్వహించి మెుక్కులు చెల్లించుకుంటూ కొండెక్కారు. రోషన్‌తో పాటు తల్లి ఊహ, తమ్ముడు రోహన్, చెల్లెలు మేధ కూడా మెట్లు ఎక్కారు.
సాంప్రదాయ దుస్తులలో కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు శ్రీకాంత్. దీనికి సంబందించిన వీడియో ఇపుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీకాంత్ ఊహ ల గారాల పట్టి మేధా, లంగావోణీలో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…