AP Elections 2024: ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అత్యధిక పోలింగ్ నమోదు కావడం విశేషం. ఇలా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ జరగడంతో తప్పకుండా ప్రతిపక్షానికి అనుకూలంగా మారుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కూటమి సభ్యులు కూడా తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఓటింగ్ శాతం భారీగా పెరగడంతో అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది అన్న విషయంపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది కేవలం మన ఆంధ్రాలో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా ఏపీ ఎన్నికలపై ఎంతో ఉత్కంఠత నెలకొందని చెప్పాలి. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏపీలో హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని భావిస్తున్నారనే ప్రశ్న కేటీఆర్ కు ఎదురైంది. ఈ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెబుతూ ఆంధ్రలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు అక్కడ అధికారులు కూడా బాగా తెలుసు.
కాంగ్రెస్ ఒక్క సీటుకే పరిమితం..
నాకున్న సమాచారం ప్రకారం ఈసారి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాబోతున్నారంటూ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇక తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల గురించి కూడా ఈయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలందరూ కూడా తమ పార్టీకే ఓటు వేశారని తెలంగాణలో కాంగ్రెస్ కేవలం ఒక సీటుకు మాత్రమే పరిమితం అవుతుంది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…