Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కూటమిలో భాగంగా పిఠాపురం నుంచి జనసేన పార్టీ తరఫున అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేశారు అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత రాబోయే ఫలితాల గురించి అందరిలోనూ ఆసక్తి కూటమి గెలుస్తుందని కొన్ని సర్వేలు తేల్చి చెప్పగా మరికొన్ని సర్వేలు తిరిగి జగన్ అధికారంలోకి రాబోతున్నారని వెల్లడిస్తున్నారు.
ఇక పెరిగిన పోలింగ్ శాతం చూస్తుంటే కనుక కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ మీరు సంపాదించినది మొత్తం రాజకీయాలలో పెడుతున్నారు. ఈ విషయంలో మీ పిల్లలు మిమ్మల్ని ఏమి ప్రశ్నించరా అని ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు పవన్ సమాధానం చెబుతూ నేను నా పిల్లలను ఒక సగటు ఉద్యోగి తన పిల్లలను ఎలా పెంచుతారో అలాగే పెంచుతున్నాను. వారి మీద కొన్ని ప్రాపర్టీలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. వారికి మంచి చదువును అందిస్తున్నాను. ఏ తండ్రి అయిన తన పిల్లలకు ఎంతవరకు చేయగలరు నేను కూడా నా పిల్లలకు అంత చేశానని పవన్ తెలిపారు..
చదువే ఆస్తి..
పిల్లలకు మనం ఎంత ఆస్తి ఇచ్చాము అనేది ముఖ్యం కాదు వారు ఎంత నిలబెట్టుకున్నారు అనేది ముఖ్యమని తెలిపారు. మా నాన్న నాకు ఏ ఆస్తి ఇవ్వలేదు కేవలం ధైర్యం మాత్రమే ఇచ్చారు నా అన్నయ్య నుంచి కొన్ని స్కిల్స్ నేర్చుకుని నా కాళ్ళపై నేను నిలబడ్డాను. ఇక పిల్లలు కూడా వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా ప్రైమరీ స్టడీస్ అందించాలని తెలిపారు. ఇక నేను ప్రతిరోజు ఇదే నా చివరి రోజు అనేలా బ్రతుకుతానని, రేపు ఏం జరుగుతుంది అనే విషయం ఎవరికి తెలుసు అంటూ ఈ సందర్భంగా పవన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…